పలాయనం లేదు.. పటిష్ట భద్రతే!

ఇవాళ, శుక్రవారం జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశానికి.. ప్రభుత్వం విపరీతమైన బందోబస్తు చర్యలు ఏర్పాటు చేస్తోంది. అమరావతి ప్రాంత రైతులు, ప్రజల నుంచి ఎలాంటి నిరసన జ్వాలల సెగ అంటకుండా ఉండడానికి..ప్రభుత్వం, పోలీసు…

ఇవాళ, శుక్రవారం జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశానికి.. ప్రభుత్వం విపరీతమైన బందోబస్తు చర్యలు ఏర్పాటు చేస్తోంది. అమరావతి ప్రాంత రైతులు, ప్రజల నుంచి ఎలాంటి నిరసన జ్వాలల సెగ అంటకుండా ఉండడానికి..ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గట్టి చర్యలే తీసుకుంటోంది.

మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చిన తర్వాత.. అమరావతి ప్రాంతంలో నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కేబినెట్ భేటీ వేదికను విశాఖకు మార్చుకుంటుందని పుకార్లు వచ్చాయి. ప్రభుత్వం మాత్రం అలా పలాయనమంత్రం పఠించకుండా దృఢచిత్తంతో వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రేరేపిత నిరసనలను ఖాతరు చేయకుండా.. అమరావతిలోనే కేబినెట్ భేటీ నిర్వహించి.. ప్రజాహిత నిర్ణయాలు తీసుకోడానికి వీలుగా.. చర్యలు తీసుకుంటోంది.

మూడు రాజధానులు అనే అంశాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేయడానికి.. రగడ సృష్టించడానికి విపక్షాలు అతిగా వాడుకుంటున్నాయి. 13 జిల్లాలు, కొన్ని వేల గ్రామాలు ఉన్న రాష్ట్రంలో కేవలం 29 గ్రామాల్లో తప్ప.. సర్వత్రా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏకపక్షంగా ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నప్పుడు.. వేరే గతిలేక, ప్రత్యామ్నాయం లేక ఆరోజున ప్రజలందరూ అమరావతిలోనే కేంద్రీకృతంగా అభివృద్ధిని ఉంచే ప్రతిపాదనకు తలొగ్గారు. కానీ.. చంద్రబాబునాయుడు తన అయిదేళ్ల పదవీకాలంలో రాజధాని దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.

జగన్మోహన రెడ్డి రాగానే.. ప్రగతి వికేంద్రీకరణలో భాగంగా.. మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. సహజంగానే చంద్రబాబు హయాంలో రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్నారు. తాము ఇచ్చిన భూములు ఏమవుతాయో.. నష్టపోతామేమో అనే భయం వారిలో ఉంది. అటు తెలుగుదేశం గానీ, ఇటు జనసేన గానీ.. తెరవెనుకనుంచి తమ మాటలతో అక్కడి ప్రజల్లోని భయాలను మరింతగా పెంచిపోషిస్తున్నారు. దీంతో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

ప్రభుత్వం మాత్రం.. కేబినెట్ భేటీ వేదికను మరోచోటకు మార్చకుండా.. కేవలం భద్రత ఏర్పాట్లు మాత్రం పెంచి.. అదే స్థలంలో నిర్వహిస్తుండడం.. రాష్ట్రహితానికి చర్యలు తీసుకునే దిశగా స్థిరమైన ముందడుగుగా అభివర్ణించవచ్చు.

తిడితే పడటానికి నేను పవన్ కళ్యాణ్ కాదు