ఉక్కు విషయంలో తగ్గేదిలే… ?

విశాఖ ఉక్కు కరిగిపోతోంది. ప్రైవేట్ దెబ్బకు ముక్కలవుతోంది. ఒక విధంగా దీనావస్థగానే  ఉక్కు కధ ఉంది. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేని స్థితి అని కూడా ఇక్కడ చెప్పాలి. విశాఖ ఉక్కుని ప్రైవేట్…

విశాఖ ఉక్కు కరిగిపోతోంది. ప్రైవేట్ దెబ్బకు ముక్కలవుతోంది. ఒక విధంగా దీనావస్థగానే  ఉక్కు కధ ఉంది. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేని స్థితి అని కూడా ఇక్కడ చెప్పాలి. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం మరో మారు పార్లమెంట్ సాక్షిగా కుండబద్ధలు కొట్టింది. ఏపీకి చెందిన ఎంపీలూ ఉభయ సభలలో అడిగిన ప్రశ్నల‌కు కేంద్ర ఉక్కు శాఖ పక్కాగా క్లారిటీ ఇచ్చేసింది.

విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించం ఖాయమని కూడా గట్టి సంకేతాలు ఇచ్చింది. అంతే కాదు ప్రైవేట్ తో కలిగే లాభాలను కూడా వరసగా ఏకరువు పెట్టింది. ప్రైవేటీకరిస్తే విశాఖ ఉక్కు పరిశ్రమకు మరిన్నిపెట్టుబడులు వస్తాయని, కర్మాగారాన్ని ఇంకా బాగా విస్తరించి ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతాయని కూడా పేర్కోనడం విశేషం.

మొత్తానికి చూస్తూంటే ఉక్కు ప్రైవేట్ కే తాము మొగ్గు చూపుతున్నామని ఇప్పటికి అనేకసార్లు చెప్పిన కేంద్రం తాజా మాట కూడా అదే అనేసినట్లే భావించాలి. ఇక ఈ విషయంలో ఏం చేయాలి అన్నది ఏపీకి చెందిన రాజకీయ పక్షాలే తేల్చుకోవాలేమో.

ఎవరెన్ని చేసినా కూడా ఏపీలో బీజేపీకి రాజకీయ బలం లేదు, ఆ పార్టీకి ఏం చేసినా చెల్లుతుంది అన్న తీరునే వ్యవహరిస్తోంది అన్నది మేధావుల మాట. అయితే బీజేపీతో ఏ విధంగా భవిష్యత్తులో రాజకీయ ఒప్పందాలను పెట్టుకోమని ఏపీలోని ప్రధాన పార్టీలు చెప్పగలిగినపుడే కొంత అయినా దిగి వచ్చే చాన్స్ ఉంది. కానీ ఏపీలో చూస్తే అన్ని రాజకీయ పార్టీల కధ అందరికీ తెలిసిందే. సో బీజేపీ రాజకీయ ధీమా కూడా ఇదే అయి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.