జగన్ అంటే జె టాక్స్ అని ఏపీలో విపక్షం అంటోంది. కానీ జగన్ అంటే కొత్త అర్ధం చెప్పారు దాల్మియా గ్రూప్ అధినేత పునీత్ దాల్మియా. జె ఫర్ జగన్ జె ఫర్ జోష్. జగన్ అంటేనే జోష్ అని ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
జగన్ ఉంటేనే జోష్ ఉంటుందని, ఆయన పాలనా విధానం కూడా స్పూర్తివంతంగా ఉంటుందని కొనియాడారు. జగన్ డైనమిక్ లీడర్ అన్నారు ఆయన డెసిషన్స్ చాలా వేగంగా తీసుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పునీత్ దాల్మియా పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం తమ పట్ల చూపించిన మర్యాదా ఆతీధ్యం చాలా గొప్పగా ఉన్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.జగన్ కుటుంబంతో తమ పరిచయం దశాబ్దన్నర కాలం నాటిదని అన్నారు ఆనాడు వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు కడపలో వేయి కోట్లతో తాము ప్రాజెక్ట్ చేపట్టామని ఇపుడు ఆంధ్రా అభివృద్ధి కోసం జగన్ తో కలసి కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతామని పునీత్ దాల్మియా హామీ ఇచ్చారు.
జగన్ ది విలక్షణమైన వ్యక్తిత్వం అని దాల్మియా కొనియాడారు. ఏపీలో జోష్ ని జగన్ని జోడిస్తే సమగ్రమైన అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన అన్నారు. రానున్న ఏళ్ళలో ఏపీ అభివృద్ధి పధంలో కొనసాగుతుందని దాల్మియా ధీమా వ్యక్తం చేశారు.
ఆ దిశగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సుని భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా ఏపీ ప్రభుత్వం తన దృఢ సంకల్పాన్ని చాటుకుందని ఆయన ప్రశంసించారు. తాను తనతో పాటు చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏపీ పట్ల ఆకర్షితులవుతున్నట్లుగా ఆయన వెల్లడించారు.