విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా వుంటామని జనసేన ప్రకటించింది. తెలుగుదేశం నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ తెలుగుదేశం సామాజిక అను’కుల’ మీడియా మాత్రం తమ పార్టీ మనసు ఎరిగి ప్రవర్తిస్తోంది.
పలు డిజిటల్ చానెల్లు, వెబ్ మీడియాలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా గ్లోబల్ సమ్మిట్ ను అభాసు చేసే బాధ్యతను, వెక్కిరించే వ్యవహారాన్ని తమ భుజాల మీద వేసుకున్నాయి.
సమ్మిట్ లో ఏం సాధించారు అన్నది పక్కన పడేసాయి. లోటు పాట్లు, ఇతరత్రా వ్యవహారాలను హైలైట్ చేయడం పనిగా పెట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ పలు మీడియా సంస్థలు అన్నీ ఈ రోజంతా ఇదే పని పెట్టుకున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ లేదా దాని నాయకులు నేరుగా విమర్శిస్తే రాజకీయాలు చేసారు అంటారు. అందుకే ఈ బాధ్యతను తమ అను’కుల’ సామాజిక మీడియాకు అప్పగించాయనుకోవాలేమో?
అంత పెద్ద సదస్సు నిర్వహించినపుడు చిన్న చిన్న లోటు పాట్లు వుంటాయి. గతంలో రెండు సార్లు చంద్రబాబు ఇలాంటి సదస్సు నిర్వహించారు. మరి అప్పుడు ఇవే మీడియా సంస్థలు, భారీ ఏర్పాట్లు, భారీ ఫొటొలు, అంతా భారీ భారీ అంటూ భజన ఎలా చేసాయి? లక్షల కోట్ల ప్రాజెక్టులు వచ్చేసినట్ల ఎలా ఊరించాయి. మరి ఇప్పుడు మాత్రం ఎందుకిలా రివర్స్ గేర్ లో వెళ్తున్నాయి.
తెలుగుదేశం తో వున్న అనుబంధంతో వచ్చిన ఆదేశాల ఫలితం కావచ్చు.