రైటర్ హర్షతో సుధీర్ బాబు

వరుసగా సినిమాలు నిర్మించడం టార్గెట్ గా పెట్టుకున్న ఆసియన్ సునీల్ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.  Advertisement రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ప్రూవ్ చేసుకున్న…

వరుసగా సినిమాలు నిర్మించడం టార్గెట్ గా పెట్టుకున్న ఆసియన్ సునీల్ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 

రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ప్రూవ్ చేసుకున్న హర్ష వర్దన్ డైరక్షన్ లో సుధీర్ బాబు హీరోగా ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసారు. హీరోగా సుధీర్ బాబుకి ఇది 15వ సినిమా. 

ఫన్ అండ్ యాక్షన్ జోనర్ లో తయారైన కథతో ఈ సినిమా నిర్మిస్తారు. ఈ సినిమాకు ఫార్మల్ గా ఈ రోజు పూజ చేసారు. నిర్మాతల్లో ఒకరైన రామ్మోహనరావు స్క్రిప్ట్ ను దర్శకుడికి అందించారు. 

చేతన్ భరద్వాజ్ సంగీతం అందించే ఈ సినిమాకు పిజి విందా సినిమాటోగ్రాఫర్. రాజీవ్ ఆర్ట్ డైరక్టర్. ఇలా హై ఎండ్ టెక్నికల్ కాస్ట్ తో కూడిన ఈ సినిమాకు స్టార్ కాస్ట్ ను త్వరలో ప్రకటిస్తారు.