క్రిస్మ‌స్‌కు ర‌ష్యా వెళ్లిన ప‌వ‌న్‌!

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొనేందుకు భార్య అన్నాలెజెనోవాతో క‌లిసి జ‌ప‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాన్ ర‌ష్యాకు వెళ్లిన‌ట్టు స‌మాచారం. భార్య‌తో క‌ల‌సి రష్యాలో వెళుతున్న ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఒక‌వైపు జ‌గ‌న్ మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని…

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొనేందుకు భార్య అన్నాలెజెనోవాతో క‌లిసి జ‌ప‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాన్ ర‌ష్యాకు వెళ్లిన‌ట్టు స‌మాచారం. భార్య‌తో క‌ల‌సి రష్యాలో వెళుతున్న ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఒక‌వైపు జ‌గ‌న్ మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ప‌దేప‌దే విమ‌ర్శిస్తున్న ప‌వ‌న్ క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొనేందుకు ర‌ష్యా వెళ్ల‌డంపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

ఇంట్లో మాత్రం క్రీస్తును పూజిస్తూ బ‌య‌ట మాత్రం జ‌గ‌న్‌పై నింద‌లు వేయ‌డం ప‌వ‌న్‌కే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ట్విట‌ర్‌లో త‌ప్ప ప‌వ‌న్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ట్టు ఆయ‌న అత్తారింటికి ర‌ష్య‌న్‌కు వెళ్లిన‌ట్టుగా ఉంది.

మ‌రెందుకో ఆయ‌న ఎవ‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు కూడా చెప్పిన‌ట్టు క‌నిపించ‌లేదు. బ‌హుశా ఆయ‌న ఇత‌ర దేశాల్లో ఉండ‌డం వ‌ల్ల రెస్పాండ్ కాలేక‌పోతున్న‌ట్టుంది. స‌హ‌జంగా ప‌వ‌న్ ప్ర‌తి విష‌యానికి ఇటీవ‌ల ట్విట‌ర్ వేదిక‌గా స్పందిస్తున్నారు.