బన్నీ-ఆరు నెలలు రెస్ట్?

స్టైలిష్ స్టార్ బన్నీ కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోబోతున్నారా?  అవిశ్రాంతంగా పుష్ప సినిమా మీద వర్క్ చేసిన బన్నీ కొన్నాళ్లు విశ్రాంతి కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఆరు నెలల తరువాతే ఆయన ఏ సినిమా చేయబోయేదీ…

స్టైలిష్ స్టార్ బన్నీ కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోబోతున్నారా?  అవిశ్రాంతంగా పుష్ప సినిమా మీద వర్క్ చేసిన బన్నీ కొన్నాళ్లు విశ్రాంతి కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఆరు నెలల తరువాతే ఆయన ఏ సినిమా చేయబోయేదీ తెలుస్తుంది.

స్టైలిష్ స్టార్ స్టార్ గా, ఫ్యామిలీలు బాగా ఇష్టపడే హీరోగా పేరు తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు ఏ సినిమా చేస్తారు? ఇది అసలు సిసలు ప్రశ్న. రెండు భాగాలుగా పుష్ప చేయాలని అనుకోవడం ఇప్పడు బన్నీకి కాళ్ల సంకెల గా మారింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, సరైనోడు, డిజె లాంటి సినిమాలు అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను, ఇటు మాస్ ఆడియన్స్ ను సమానంగా ఆకర్షించాయి. బ్లాక్ బస్టర్లు అయ్యాయి. గెటప్ లు, ఊర మాస్ ఫైట్లు యాడ్ చేసిన బద్రీనాధ్, నా పేరు సూర్య లాంటి సినిమాలు దారుణంగా ఫెయిలయ్యాయి.

ఇలాంటి టైమ్ లో రంగస్థలం సినిమా చూసి తాను కూడా అలాంటి రగ్డ్ సినిమా చేయాలనుకుని పుష్ప సినిమా ట్రయ్ చేసారు. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నపుడే హీరో మహేష్ బాబు ముందుగా నో చెప్పారని వార్తలు వచ్చాయి. కారణం ఆయన ఇమేజ్ కు ఇది ఏమాత్రం సెట్ కాదనే.  ఒక పార్ట్ గా ఈ సినిమా చేసి వుంటే బన్నీకి సమస్య లేదు. ఎందుకంటే ఇది అయిపోగానే మరో ఫ్యామిలీ టచ్ సినిమా చేసేసుకోవచ్చు.

కానీ ఇప్పుడే మయింది. రెండు భాగాలు చేసారు. తొలిభాగం అరకొరగానే కథ చెప్పాల్సి వచ్చింది. పైగా అంతా రఫ్, రగ్డ్ గా మిగిలింది.  సో మలిభాగం వెంటనే చేయడం అంటే అది కచ్చితంగా బ్యాడ్ డెసిషన్ అవుతుంది. అలా అని ఇప్పుడు మళ్లీ ఫ్యామిలీ ప్లస్ మాస్ సినిమా చేయాలంటే ఎవరు రెడీగా వున్నారు? ఇది అసలు సిసలు ప్రశ్న

బోయపాటి రెడీగా వున్నారు. కానీ ఆయన మళ్లీ అటు ఫ్యామిలీ ఇటు మాస్ కలిసిన సరైన కథ అల్లాలి. అలా కాకుండా ఆయన స్టయిల్ ఊరమాస్ ఫైట్లు, మాస్ మాత్రమే మెచ్చే కథ ఎంచుకుంటే సమస్య అవుతుంది. త్రివిక్రమ్ తో సినిమా వుంది కానీ అది ఇప్పట్లో కాదు. ఎందుకంటే మహేష్ తో త్రివిక్రమ్ కమిట్ మెంట్ వుంది.

మరే పెద్ద డైరక్టర్ అందుబాటులో లేరు. పుష్ప పార్ట్ 2 ఇమ్మీడియట్ గా చేయలేరు. బోయపాటి తో రిస్క్ చేయాల్సి వుంటుంది. లేదా వేరే డైరక్టర్ కోసం వెదకాల్సి వుంటుంది.