పూలకోసం 40 లక్షలు

సినిమా పాటలు అంటే మామూలుగా వుండవు. అందులో పెద్ద హీరోల పాటలకు సెట్ లు వేయడం అంటే ఆషామాషీ కాదు. బన్నీ – తివిక్రమ్ కాంబినేషన్ లో తయారవుతున్న 'అల వైకుంఠపురములో' సినిమాలో పాటలు…

సినిమా పాటలు అంటే మామూలుగా వుండవు. అందులో పెద్ద హీరోల పాటలకు సెట్ లు వేయడం అంటే ఆషామాషీ కాదు. బన్నీ – తివిక్రమ్ కాంబినేషన్ లో తయారవుతున్న 'అల వైకుంఠపురములో' సినిమాలో పాటలు పెద్ద హిట్ అయ్యాయి. రెండు పాటలు 100 మిలియన్ల హిట్ లు దాటాయి. వీటిలో 'సామజవరగమన' పాటను విదేశాల్లోని లోకేషన్లలో చిత్రీకరించారు.

'రాములో రాముల' పాట కోసం బీభత్సమైన సెట్ వేసి, అయిదు కోట్ల వరకు ఖర్చు చేసి చిత్రీకరించారు. అన్ని పాటల చిత్రీకరణ అయిపోయింది కానీ 'బుట్టబొమ్మ' పాట చిత్రీకరణ మిగిలింది. ఈ పాట కోసం రెండు సెట్లు వేస్తున్నారు. అన్నపూర్ణలో వేస్తున్న సెట్ లో 25 నుంచి మూడు నుంచి అయిదు రోజుల పాటు చిత్రీకరణ వుంటుంది.

ఇదిలా వుంటే ఈ పాట కోసం వేస్తున్న సెట్ లో వాడేందుకు విదేశాల నుంచి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాంట్స్ తెప్పించారు. కేవలం వీటి కోసమే 40 లక్షలు ఖర్చు చేసారట. పాట అయిన తరువాత వీటిని వదులుకోవాలన్నా సమస్యే..దాచాలన్నా సమస్యే. దాచాలి అంటే స్పేస్, మెయింట్ నెన్స్. వదిలించుకోవాలి అంటే అన్ని లక్షలు పెట్టి కొన్నవి, ఫ్రీగా ఇవ్వలేరు. అలా అని కొనేందుకు ఎవరైనా ముందుకు వస్తారో? రారో?

సినిమా మేకింగ్ బాధలు ఇన్నీ అన్నీ కావు. ఈ 'బుట్ట బోమ్మ' పాటను 24న సాయంత్రం విడుదల చేస్తున్నారు.