''….అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అన్నీ ఒకేచోట పెట్టడం మంచిది కాదు. రాజధానిలో అన్నీ ఉంటే మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదు…''
ఈ మాటలు అన్నది వైఎస్ జగన్ కాదు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన నిట్ స్నాతకోత్సవంలో మంగళవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే మళ్లీ ఆయనే తన కామెంట్లు ప్రస్తుత రాజధాని రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాదని చిన్న మాట కూడా వదిలారు.
సరే, ఈ మాట ఎలా వున్నా, అన్నీ రాజధానిలోనే వుండడం సరికాదు అని ఆయన చెప్పిన మాటకు, ప్రస్తుతం ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కార్యక్రమాలకు సరైన సింక్ కుదరినట్లు వుండడం విశేషం.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ విషయంలో చేసిన తప్పు మళ్లీ చేయకూడదనే చాలా మంది అభిప్రాయం. అప్పట్లోనే హైదరాబాద్ లో రాజధాని విశాఖలో హైటెక్ సిటీ, కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. ఇప్పుడు ఆ తప్పును సరిచేస్తూ, జగన్ ఆంధ్రలోని మూడు ప్రాంతాలకు సమాన న్యాయం చేయాలనుకుంటున్నారు.
మంగళగిరిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రయత్నాలకు ఊతనిచ్చే విధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్ చేయడం విశేషం