లోకేశ్ మళ్లీ ‘పప్పు’లో ట్వీట్ వేశాడు. లోకేశ్‌కు పప్పులో కాలేయడం, ట్వీట్ వేయడం వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. ఆయనకు తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా రాదని ఈ దెబ్బతో అర్థమవుతోంది. సీఎం వైఎస్ జగన్ కడప పర్యటనలో భాగంగా NRCకి తమ ప్రభుత్వం వ్యతిరేకమని ప్రకటించాడు. దీనిపై నారా లోకేశ్ యుద్ధ ప్రాతిపదికన ట్విటర్‌లో స్పందించాడు. అదేదో సరిగ్గా స్పందించి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ ట్వీట్ మరొకసారి లోకేశ్‌కు ‘పప్పు’ నామకరణాన్ని బలోపేతం చేసింది.
ఇంతకూ లోకేశ్ ట్వీట్ ఏంటంటే…
‘ఇప్పుడు కడప సభలో ఎన్ఆర్సీ అమలు చేయమని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా, ఎంతకైనా దిగజారుతారు. వైసీపీ నాయకులు వారి అధ్యక్షుడు వైఎస్ జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయట మాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. 16 ఆగస్టు 2019న NRC పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని నారా లోకేశ్ ఘాటుగా ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌తొ పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఆగస్టు 2019న వెలువరించిన గెజిట్ నోట్‌ను కూడా పోస్ట్ చేశాడు. ‘అబ్బో లోకేశ్‌కు జగన్మోహన్‌రెడ్డి భలే చిక్కాడే’ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ గెజిట్ నోట్‌ను చదివాక లోకేశ్ అజ్ఞానం మరోసారి బయటపడింది.
ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులకు డైరెక్షన్ ఇస్తూ లోకేశ్ పేర్కొన్న తేదీలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా పేరుతో గెజిట్ నోట్ విడుదల చేశారు. ఈ నోట్‌లో 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలు చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి.
అసలు విషయం అదైతే, మన లోకేశ్ మాత్రం ‘చూడండి చూడండి ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు ఎంతకైనా దిగజారుతాడ’ని ట్వీట్ చేసి అపహాస్యం పాలయ్యాడు. కొందరి తలరాతలు అంతేనేమో మరి. జగన్‌ను నవ్వులపాలు చేయబోయి తానే నవ్వులపాలయ్యాడు. మొత్తానికి మరోసారి లోకేశ్ ‘పప్పు’లో ట్వీట్ వేసి నెటిజన్లకు కావాల్సినంత పని కల్పించాడు.