‘ఖుషి’ సీక్రెట్ బయటపెట్టిన భూమిక

భూమిక కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఖుషి. ఈ సినిమా నుంచే ఆమె కెరీర్ ఊపందుకుంది. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదగడం, పెళ్లి చేసుకోవడం, తిరిగి రీఎంట్రీ…

భూమిక కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఖుషి. ఈ సినిమా నుంచే ఆమె కెరీర్ ఊపందుకుంది. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదగడం, పెళ్లి చేసుకోవడం, తిరిగి రీఎంట్రీ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మళ్లీ ఇన్నేళ్లకు అప్పటి ఖుషి సినిమా మెమొరీస్ ను పంచుకుంది భూమిక.

కెరీర్ లో మూడో సినిమా అయిన ఖుషిని జీవితంలో మరిచిపోలేనని, కేవలం సక్సెస్ పరంగానే కాకుండా.. ఆ మూవీ షూటింగ్ టైమ్ లో తనకు చాలా అనుభూతులున్నాయని చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా సూపర్ హిట్ అయిన “దీపం సీన్” గురించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టింది.

“సినిమాలో దీపం సీన్ ఒకటి ఉంది. గుడిలో దీపం ఆరకుండా నేను, పవన్ పట్టుకునే సీన్ అది. డైరక్టర్ చెప్పినట్టు ఆ సీన్ కోసం చాలా తక్కువ మేకప్ తో షాట్ కు వెళ్లాను. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కు ఆ మేకప్ కూడా ఎక్కువైంది. వెళ్లి ముఖం కడుక్కొని రమ్మన్నారు. నేను ఒప్పుకోలేదు. ఆయనే ఫేస్ వాష్ తెప్పించి మరీ దగ్గరుండి ముఖం కడుక్కోమని చెప్పారు. ఆ సీన్ లో అస్సలు మేకప్ లేకుండా నటించాను. ఇప్పటికీ నా ఫేవరెట్ సీన్ అదే. అద్భుతంగా వచ్చింది.”

రూలర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన భూమిక, ఆ మూవీ ప్రమోషన్ కోసం మీడియాతో మాట్లాడుతూ ఇలా తన గత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంది. ఖుషి సినిమాలో దాదాపు 80శాతం సీన్స్ లో తను మేకప్ వేసుకోలేదని, ఓ 20 శాతం సీన్స్ లో మాత్రం లైట్ మేకప్ తో కనిపించానని చెప్పుకొచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లోనే పవన్ తో కలిసి నటించడాన్ని తన అదృష్టంగా చెబుతోంది భూమిక.