హీరో బాలయ్య ఓ సెన్సేషన్ స్టేట్ మెంట్ పడేసారు. హాలీవుడ్ అవతార్ సినిమా తనకు అస్సలు నచ్చలేదు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసారు. దర్శకుడు రాజమౌళితో కలిసి చేసిన చాట్ షో లో ఆయన ఈ విషయం వెల్లడించారు.
ఇప్పటికీ అవతార్ సినిమా కనిపిస్తే అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోతాను అన్నారు. మీ జనరేషన్ కు నచ్చక పోవచ్చు..మా జనరేషన్ కు నచ్చవచ్చు అనే టైపు అర్థంలో రాజమౌళి తిరిగి జవాబిచ్చారు. ఈ చాట్ షో ఆద్యంతం హుషారుగా సాగింది.
ఎప్పుడూ కీరవాణి తోనేనా, కొత్తవారితో ట్రయ్ చేయవచ్చు కదా అని బాలయ్య అడగ్గా, పులి..సింహం కలిసి ఈ ఏనుగు మీద పడతాయా అని కీరవాణి చమత్కరించారు.
తాను చిన్నప్పుడు కీరవాణి మాదిరిగా లావుగా వుండేవాడిని అని తనను బాలు అని పిలిచేవారని బాలకృష్ణ వెల్లడించారు. ఇంట్లో భోజనం టేబుల్ దగ్గర అందరి హీరోల మీద గ్యాసిప్ లు మాట్లాడుకుంటాం అని రాజమౌళి వెల్లడించారు. తనకు నీళ్లు అంటే భయం అని అందుకే క్రూజ్ ప్రయాణం అంటే కష్టం అని కీరవాణి చెప్పారు.