ప్రతి రోజూ పండగే సినిమాతో మరో టెస్ట్ పాస్ అయిపోయారు దర్శకుడు మారుతి. కాన్సెప్ట్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు అనే కామెంట్ల నుంచి, శైలజరెడి అల్లుడు సినిమా ఇచ్చిన ఝలక్ నుంచి తేరుకుని, తాను కూడా ఫీల్ గుడ్ సినిమాలను తీయగలనని, ఎమోషన్ కు కామెడీ టచ్ ఇచ్చి, జనాలను థియేటర్లకు రప్పించగలనని ప్రూవ్ చేసుకున్నారు.
ప్రతి రోజూ పండగే సినిమా సోమవారం ఢమాల్ మని జారిపోకుండా బాగానే నిలదొక్కుకుంది. దీంతో ఇప్పుడు తరువాత ఏంటీ? అనే ఆలోచనలో పడ్డారు మారుతి. డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ సినిమా వుంది కానీ, మాట్నీ ఎంటర్ ప్రైజెస్ కు ఓ సినిమా, మహేష్ సోదరి మంజులకు ఓ సినిమా చేయాల్సి వుంది. అలాగే దిల్ రాజు కు కూడా.
వీరిలో హీరో రామ్ తో సినిమా ఎవరు అంటే వారికి చేయాలని మారుతి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ ఎనర్జీ లెవెల్స్ వాడుకుని, ఫుల్ లెంగ్త్ ఫన్ జోనర్ మూవీ చేయాలన్నది మారుతి ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇప్పటికి ఇంకా రామ్ దగ్గరకు ఆ ప్రపోజల్ వెళ్లిందా లేదా అన్నది తెలియదు.