అనుష్క ఇక అలాంటి సినిమాల‌కే?

ఒక‌వైపు లేడీ ఒరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ కూడా చాలా మంది హీరోయిన్లు ఇత‌ర హీరోల సినిమాల్లో కూడా న‌టిస్తూ ఉంటారు.  త‌మ కెరీర్ ను అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు వాళ్లు. అందుకు ప్ర‌స్తుత…

ఒక‌వైపు లేడీ ఒరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ కూడా చాలా మంది హీరోయిన్లు ఇత‌ర హీరోల సినిమాల్లో కూడా న‌టిస్తూ ఉంటారు.  త‌మ కెరీర్ ను అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు వాళ్లు. అందుకు ప్ర‌స్తుత ఉదాహ‌ర‌ణ న‌య‌న‌తార‌. ఒక‌వైపు న‌య‌న‌తార వివిధ సినిమాల్లో త‌నే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌స్తోంది. ఆ సినిమాల‌న్నీ న‌య‌న‌తార పేరు మీదే మార్కెటింగ్ అవుతూ ఉన్నాయి. 

అలా లేడీ ఒరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ.. ఇత‌ర హీరోల సినిమాల‌కూ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ఉంది న‌య‌న‌తార‌. ఇలా త‌న కెరీర్ ను ఆమె ముందుకు తీసుకెళ్తూ ఉంది. అయితే అనుష్కా షెట్టి మాత్రం.. భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంది.

అనుష్క పేరిట కూడా ఇప్పుడు సినిమాల‌ను మార్కెటింగ్ చేసే ప‌రిస్థితి పుష్క‌లంగా ఉంది. బాహుబ‌లి సీరిస్ తర్వాత ఆమె చేసిన సినిమా నిశ్శ‌బ్ధం విడుద‌ల‌కు రెడీ అవుతూ ఉంది. ఇక అనుష్క త‌దుప‌రి సినిమా కూడా ఒక థ్రిల్ల‌రే అని తెలుస్తోంది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో ఈ సినిమా రూపొందనుంద‌ట‌. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత ఇత‌ర హీరోల సినిమాల్లో దేనికీ అనుష్క సైన్ చేసిన‌ట్టుగా ప్ర‌క‌ట‌న‌లు రాలేదు. బ‌హుశా ఇక హీరోయిన్ అవ‌కాశాల‌ను ప‌క్క‌న పెట్టి, అనుష్క త‌నే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించే సినిమాల‌తో సాగిపోతుందేమో!