తిరుపతి వేదికగా రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో శనివారం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ రంగాల్లోని నిపుణులు వస్తున్నారు.
దీంతో ఆ సభను విజయవంతం చేసేందుకు ప్రధానంగా రాయలసీమలోని అన్ని ప్రాంతాల నుంచి వివిధ సీమ అభివృద్ధి, ప్రజాసంఘాల నేతృత్వంలో జనం తరలిరానున్నారు. దీంతో ఇవాళ అన్ని దారులూ తిరుపతి వైపే చూపుతుండడం విశేషం.
నిన్న తిరుపతిలో అమరావతి సభ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. మరోవైపు అమరావతి పేరుతో సీమ, ఉత్తరాంధ్ర, ఆ 29 గ్రామాలు మినహా మిగిలిన ప్రాంతాలను రెచ్చగొట్టేలా ఎల్లో బ్యాచ్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల అభివృద్ధిని ఆ 29 గ్రామాలను సుసంపన్నం బలి పెట్టాలనే డిమాండ్‌పై నిరసన వ్యక్తమవుతోంది. దీంతో తిరుపతిలో అభివృద్ధి వికేంద్రీకరణపై నిర్వహించనున్న చైతన్య సభపై అందరి దృష్టి పడింది.
తిరుపతి నగరంలోని తుడా సమీపంలో ఇందిరా మైదానంలో ఈ సభ ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకూ కొనసాగనుంది. అమరావతి రాజధాని కోసం ఇతర ప్రాంతాల ఆకాంక్షలకు ఎలా సమాధి కడుతున్నారో వక్తలు కళ్లకు కట్టనున్నారు. మూడు రాజధానుల ఆవశ్యకతను సభలో ఆవిష్కరించనున్నారు.