కత్రినా కైఫ్ అందుకున్న పెళ్లి బహుమతులు ఇవే..!

ఖరీదైన పెళ్లికి అంతే ఖరీదైన బహుమతులు వస్తుంటాయి. కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ పెళ్లికి కూడా అలాంటి కాస్ట్ లీ బహుమతులే వెల్లువెత్తాయి. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు అందించిన గిఫ్టులు చూస్తే కళ్లు చెదరడం…

ఖరీదైన పెళ్లికి అంతే ఖరీదైన బహుమతులు వస్తుంటాయి. కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ పెళ్లికి కూడా అలాంటి కాస్ట్ లీ బహుమతులే వెల్లువెత్తాయి. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు అందించిన గిఫ్టులు చూస్తే కళ్లు చెదరడం ఖాయం.

ముందుగా సల్మాన్ ఖాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. భారీ బహుమతులిస్తూ అందర్నీ సంతృప్తిపరిచే కండలవీరుడు, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కత్రినాకు కూడా తన స్థాయికి తగ్గ భారీ బహుమతి ఇచ్చాడు. కత్రినా-విక్కీ దంపతులకు రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించాడు సల్మాన్. దీని ఖరీదు అక్షరాలా 3 కోట్ల రూపాయలు.

దాదాపు ఇంతే ఖరీదైన బహుమతిని కత్రినా ఎక్స్-బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కూడా అందించాడు. కత్రినాకు పెళ్లి కానుకగా వజ్రాల నెక్లెస్ ను బహుకరించాడు రణబీర్. దీని విలువ దాదాపు 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఉంటుందట.

ఇక షారూక్ ఖాన్ అయితే మరోసారి తన టేస్ట్ చూపించుకున్నాడు. కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న కత్రినా-విక్కీ కోసం ఓ మంచి పెయింటింగ్ ను బహుమతిగా ఇచ్చాడు. ఇదేదో సాదాసీదా పెయింటింగ్ కాదు, అక్షరాలా లక్షన్నర రూపాయల ఖరీదైన గిఫ్ట్ ఇది.

ఇక అనుష్క శర్మ, తన ఫ్రెండ్ కత్రినాకు 6 లక్షల విలువైన డైమండ్ రింగ్స్ బహుమతిగా ఇస్తే.. హృతిక్ రోషన్, బీఎండబ్ల్యూ బైక్ ను విక్కీకి గిఫ్ట్ గా ఇచ్చాడు. అలియా భట్ అయితే ఏకంగా లక్షన్నర ఖరీదు చేసే సెంట్ బాటిల్స్ ను నూతన దంపతులకు అందించింది.

ఇలా కత్రినా కైఫ్-విక్కీ దంపతులకు బాలీవుడ్ జనాల నుంచి భారీగా బహుమతులు ముట్టాయి. అయితే వీళ్లలో చాలామంది పెళ్లికి హాజరుకాలేదు. ఇలాంటి వాళ్లందరికీ 20వ తేదీన ముంబయిలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేసింది కత్రినా-విక్కీ జంట.