'' అప్పుడేమో ప్రజలకోసమని ప్రజారాజ్యం పెట్టే.దాన్ని మరో పార్టీలో కలిపే.మంత్రి పదవి పొంది విభజన పాపంలో భాగమయ్యే.ఇప్పుడు తమ్ముడు జనం కోసం పోరాడుతుంటే భుజం తట్టక మరో రాగమెత్తుకునే.ఐనా తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయిలే.మళ్లీ దూకేస్తాడేమో…'' అంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ప్రజల నుంచి గెలవకపోయినా చంద్రబాబు తనను మంత్రిని చేసిన కృతజ్ఞతను సోమిరెడ్డి ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటారు. ఈ క్రమంలో చిరంజీవి మీద అందరి కన్నా ముందు ఫైర్ అయిన టీడీపీ నేతగా సోమిరెడ్డి నిలుస్తూ ఉన్నారు. మూడు రాజధానుల అంశాన్ని మెగాస్టార్ సమర్థించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీకి కోపం వస్తోంది.
అమరావతికి జై కొట్టే వాళ్లు మాత్రమే కావాలి టీడీపీకి. ఎందుకంటే.. ఆ పార్టీ వ్యాపారాలన్నీ అక్కడే ఉన్నాయ్యాయె! దీంతో చిరంజీవి అంటే టీడీపీకి కోపం వస్తోంది. అయితే చిరంజీవిని రాజకీయంగా ఇప్పుడు విమర్శించడానికి మిగతా వాళ్లు కొద్దో గొప్పో ఆలోచిస్తూ ఉన్నారు. అయితే సోమిరెడ్డి మాత్రం ముందే స్పందించేస్తే చంద్రబాబు వద్ద మార్కులు పడతాయని అనుకున్నట్టుగా ఉన్నారని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.
చిరంజీవి పార్టీని విలీనం చేశారంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. అయితే పనిలో పనిగా పవన్ ను పొగిడారు. చంద్రబాబుకు అనుగుణంగా మాట్లాడుతున్న పవన్ పోరాటకారుడంటూ సోమిరెడ్డి భజన చేశారు. అయితే చిరంజీవిని పార్టీని విలీనం చేశాడంటున్న సోమిరెడ్డి మీద మెగాభిమానులు ఫైర్ అవుతూ ఉన్నారు. '' మీ అధినేత ఇప్పటి వరకూ ఎంతమందితో చేతులు కలిపాడు? ఎన్ని సార్లు అటూ ఇటూ దూకాడు? ఇప్పుడు ఎటు దేకుతున్నాడు? '' అంటూ వాళ్లు సోమిరెడ్డి పై రివర్స్ లో ఫైర్ అవుతున్నారు!