శ‌రీరంలో ప‌వ‌ర్ ఫుల్ సెక్స్ ఆర్గాన్.. బ్రెయిన్!

సెక్స్ గురించి ప్ర‌స్తావిస్తే… శృంగార జీవితాన్ని ప్ర‌భావితం చేసే ఆర్గాన్స్ అంటే.. అవి లైంగికావ‌య‌వాలే అని అంతా అనుకుంటారు. లైంగిక క‌ల‌యిక‌లో పాత్ర పోషించే ఆర్గాన్సే సెక్స్ విష‌యంలో ఆసాంతం ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయ‌నుకోవ‌డం…

సెక్స్ గురించి ప్ర‌స్తావిస్తే… శృంగార జీవితాన్ని ప్ర‌భావితం చేసే ఆర్గాన్స్ అంటే.. అవి లైంగికావ‌య‌వాలే అని అంతా అనుకుంటారు. లైంగిక క‌ల‌యిక‌లో పాత్ర పోషించే ఆర్గాన్సే సెక్స్ విష‌యంలో ఆసాంతం ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయ‌నుకోవ‌డం స‌హ‌జ‌మే. అయితే మాన‌వ శ‌రీరంలో ప‌వ‌ర్ ఫుల్ సెక్స్ ఆర్గాన్ అంటే.. అది మెద‌డు అని అంటారు ప‌రిశోధ‌కులు. మ‌నిషి లైంగికాస‌క్తిని, సెక్సువ‌ల్ డిజైర్ ను మెద‌డే చాలా వ‌ర‌కూ నిర్దేశిస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

బహుశా ఏ అవ‌య‌వం అయితే ఇత‌ర జంతుజాలం నుంచి మ‌నిషిని ప్ర‌త్యేకంగా నిలుపుతుందో, అదే ఆర్గాన్ మ‌నిషి లైంగికాసక్తుల‌ను కూడా నిర్దేశిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇత‌ర జంతు జాలంతో పోలిస్తే మ‌నిషి మెద‌డు ప‌ని చేసే తీరు నాగ‌రిక‌త‌ను ఏర్ప‌రిచింది. భూ ప్ర‌పంచంపై అనేక సాంకేతిక అద్భుతాల ఆవిష్క‌ర‌ణ‌కు మెద‌డే క్రియాశీల పాత్ర పోషించింది. మ‌రి మ‌నిషిని నాగ‌రిక‌త వైపు తీసుకెళ్ల‌డ‌మే కాదు, మ‌నిషి సామాజిక సూత్రాల‌ను కూడా నిర్దేశించిన మెద‌డే, అత‌డి శృంగార జీవితాన్ని కూడా ప్ర‌భావితం చేస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు వివ‌రిస్తున్నాయి.

శృంగార భ‌రిత‌మైన ఒక క‌థ‌ని చ‌దివినా, లేదా శృంగారోత్తేజ‌మైన సినిమా స‌న్నివేశాన్ని చూసినా… లైంగిక ప‌ర‌మైన స్పంద‌న‌లు క‌ల‌గ‌డాన్ని మ‌నిషి శృంగార స్పంద‌న‌ల‌ను నిర్దేశించేది మెద‌డే అని చెప్ప‌డానికి ఉత్త‌మ ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్ప‌వ‌చ్చు. శ‌రీరంలో లైంగికావ‌య‌వాలు వేరే ఉన్నా, సెక్సువ‌ల్ డ్రైవ్ ను మాత్రం మొద‌లుపెట్టేది మెద‌డే అని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

మ‌నిషి లైంగిక ఆస‌క్తి సాధార‌ణంగా బాడీ హార్మోన్ల మీదే ఆధార‌ప‌డి ఉంటుంది. సెక్సువ‌ల్ డిజైర్ ను క‌లిగించ‌డంలో కూడా హార్మోన్ల పాత్రే ప్ర‌ధానం. టెస్టోస్టిరాన్, ఇస్ట్రోజ‌న్, ప్రొగెస్టెరాన్ లే శృంగార కోరిక‌ల‌కు ప్ర‌దాన కార‌ణం. వీటి ఉత్ప‌త్తి అధికంగా ఉంటే సెక్స్ కోరిక అధికంగా ఉండ‌టం, ఇవి శ‌రీరంలో ఉత్ప‌త్తి కావ‌డ‌మే మ‌నిషి కి సెక్స్ కావ‌లనే కోరిక క‌లుగుతుంది. వీటి ఉత్ప‌త్తి బాగా ఉన్న వ‌య‌సులో అధిక సెక్స వాంఛ ఉండ‌టం, ఒక వ‌య‌సుకు చేరాకా వీటి స్థాయి త‌గ్గి శృంగారం ప‌ట్ల అనాస‌క్తి క‌ల‌గ‌డం జ‌రుగుతుంది.

ఇలా హార్మోన్ల ప్ర‌భావం ఉన్నా.. శ‌రీరంలోని లైంగికాయ‌వ‌కాల‌కు సెక్స్ డిజైర్ ను , ప్రేరేప‌ణను పంపే బాధ్య‌త మాత్రం మెద‌డుదేన‌ట‌. హార్మోన్ల అంత‌రార్థాన్ని ప్రాసెస్ చేసి లైంగికావ‌య‌వాల‌ను శృంగారానికి స‌మాయ‌త్తం చేసేది మెద‌డే.

అలాగే దంప‌తుల మ‌ధ్య మాట‌ల‌తో  శృంగార భావ‌న‌లు క‌ల‌గ‌డం కూడా మెద‌డు చేసే ప‌నే అని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఇష్ట‌మైన వారి మాట‌లు విన్న‌ప్పుడు శృంగార స్పంద‌న‌లు క‌ల‌గ‌డం, అలాగే డ‌ర్టీ టాక్ తో సెక్సువ‌ల్ డిజైర్స్ క‌ల‌గ‌డంలో కూడా మెద‌డు పాత్ర కీల‌కం అని చెబుతున్నారు. మ‌రి మ‌నిషి శ‌రీరంలో త‌నే పెద్ద సెక్సువ‌ల్ ఆర్గాన్ అయిన‌ప్ప‌టికీ.. సెక్సువ‌ల్ ఆర్గాన్స్ అన‌గానే లైంగికావ‌య‌వాల‌ను గుర్తు చేసేది కూడా మ‌ళ్లీ మెద‌డే!