బాలయ్య అల్లుడుని బహుమతి కోరిన బాబు…?

చంద్రబాబును అందుకే రాజకీయ ముదురు అంటారు. ఎపుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అంటారు. చంద్రబాబుకు ఇపుడు అర్జంటుగా గెలుపు పిలుపు ముఖ్యం. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న చోట్ల…

చంద్రబాబును అందుకే రాజకీయ ముదురు అంటారు. ఎపుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అంటారు. చంద్రబాబుకు ఇపుడు అర్జంటుగా గెలుపు పిలుపు ముఖ్యం. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న చోట్ల అధికార వైసీపీ అన్ని రకాలుగా మోహరించింది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలోనూ వైసీపీ జోరు చూపిస్తోంది.

ఉత్తరాంధ్రా అంతటా అధికార పార్టీకి బలం ఉంది. గ్రాస్ రూట్ లెవెల్ దాకా స్ట్రాంగ్ గా పార్టీ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అంతా కలసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి విజయం కోసం కృషి చేస్తున్నారు. ఉత్తరాంధ్రా ఎమెల్సీ సీటు గెలిచి జగన్ కి గిఫ్ట్ ఇస్తామని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు.

తెలుగుదేశం విషయానికి వస్తే సీనియర్లు మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో మాత్రం కొందరు నేతలు ఎందుకో చొరవ చూపించలేకపోతున్నారు. పైగా డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఇది. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు పెట్టుకుని ఇపుడు ఖర్చు తడిసి మోపెడు అవుతుందంటే ఆలోచించే వారున్నారు.

దీంతో మొత్తం బాధ్యతలను చంద్రబాబు బాలయ్య చిన్నల్లుడు అయిన శ్రీ భరత్ మీద పెట్టారని అంటున్నారు. శ్రీ భరత్ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంచార్జిగా ఉంటున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీని గెలిపించుకుని వస్తే ఎంపీ సీటు అంటూ చెప్పారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికలలో పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం అని బాబు చెప్పడంతో రంగంలోకి శ్రీ భరత్ దిగారని అంటున్నారు.

ఇపుడు ఆయన మీద టీడీపీ ఎమ్మెల్సీని గెలిపించాల్సిన బాధ్యత పడింది అంటున్నారు. బాబు కోరిన మేరకు ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించి బహుమతిగా ఇస్తామని శ్రీ భరత్ చెబుతున్నారు. అయితే ఇది టఫ్ టాస్క్ అని అంటున్నారు. ఒక వేళ తేడా వచ్చి టీడీపీ ఓటమి పాలు అయితే శ్రీ భరత్ ఎంపీ సీటు ఆశలు ఏమవుతాయన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు.