Advertisement

Advertisement


Home > Politics - National

మొత్తం మారిపోయాడు.. ఇప్పుడు బాధపడుతున్నాడు

మొత్తం మారిపోయాడు.. ఇప్పుడు బాధపడుతున్నాడు

పిచ్చి పలు రకాలు.. ఇది కూడా అలాంటిదే. ఓ పాప్ బ్యాండ్ పై విపరీతమైన పిచ్చి పెంచుకున్న ఓ వ్యక్తి, ఆ బ్యాండ్ సభ్యుడిగా మారిపోవాలనుకున్నాడు. కోట్లు ఖర్చుపెట్టి మారిపోయాడు కూడా. కానీ ఇప్పుడు అతడికి ఆ లుక్ నచ్చలేదు. తిరిగి తన పూర్వపు స్థితికి రావడానికి నానా తంటాలు పడుతున్నాడు.

బ్రిటన్ కు చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ ఓలీ లండన్ కు దక్షిణ కొరియాకు చెందిన బీటీఎస్ అనే పాప్ బ్యాండ్ అంటే చాలా ఇష్టం. ఆ బ్యాండ్ లో పార్క్ జిమిన్ అంటే ఇంకా ఇష్టం. ఎవరికైనా ఇష్టముంటే పచ్చబొట్టు పొడిపించుకుంటారు. కానీ ఓలీ మాత్రం జిమిన్ లా మారిపోవాలనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా హాస్పిటల్ కు వెళ్లాడు. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి జిమిన్ గా మారిపోయే ప్రయత్నం చేశాడు. దీని కోసం ఓలీ ముఖానికి ఏకంగా 18 కాస్మొటిక్ సర్జరీలు చేశారు. కళ్లు, ముక్కు, దవడ, పెదవులు.. ఇలా సమస్తం మార్చేశారు.

అలా ఏడేళ్ల పాటు కష్టపడి 2022 నాటికి జిమిన్ లా మారిపోయాడు ఓలీ. కట్ చేస్తే, ఇప్పుడు అతడికి జిమిన్ లుక్ నచ్చలేదు. పైగా సదరు పాప్ బ్యాండ్ సభ్యుడి లైఫ్ స్టైల్ పై వచ్చిన విమర్శలు ఓలీని బాగా ఇబ్బంది పెట్టాయి.

దీంతో తిరిగి తన పూర్వపు స్థితికి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఓలీ. అయితే వైద్యులు ఈ ప్రతిపాదనకు నిరాకరిస్తున్నారు. ఇన్ని సర్జరీలు జరిగిన తర్వాత, తిరిగి పూర్వపు స్థితికి రావడం కోసం మరిన్ని సర్జరీలు చేయించుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు. 32 ఏళ్ల ఓలీ, ఇప్పుడు కొరియన్ లా కనిపిస్తున్న బ్రిటిషర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?