కాజల్ అగర్వాల్.. ఈ ముద్దుగుమ్మ మన మధ్యే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆమె చివరి తెలుగు సినిమా మోసగాళ్లు. 2021లో వచ్చింది ఈమూవీ. ఆ తర్వాత ఆచార్య సినిమాలో ఆమె నటించినప్పటికీ, చివరి నిమిషంలో ఆమె పోర్షన్ మొత్తం సినిమా నుంచి తీసేశారు.
అదే టైమ్ లో పెళ్లి చేసుకొని, ఓ పిల్లాడికి జన్మనివ్వడంతో కాజల్ కెరీర్ లో లాంగ్ గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ఓ తెలుగు సినిమా సెట్స్ పైకి రాబోతోంది. అదే బాలకృష్ణ మూవీ.
అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించడానికి కాజల్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ వీకెండ్ నుంచి ఆమె ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. రీఎంట్రీ తర్వాత కాజల్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే.
కొడుకు పుట్టిన తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంది కాజల్. ఆ తర్వాత ఆమె ఇండియన్-2 సినిమా సెట్స్ లో జాయిన్ అయింది. అదే టైమ్ లో అజిత్ కొత్త సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకుంది. తెలుగులో మాత్రం ఆమె ఇంకాస్త టైమ్ తీసుకోవాలనుకుంది. అలా షార్ట్ గ్యాప్ తర్వాత బాలయ్య సినిమాతో తెరపైకి రాబోతోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది బాలయ్య-అనీల్ రావిపూడి సినిమా. ఈ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం కరెక్ట్ అని భావించింది కాజల్. రీఎంట్రీలో కూడా ఆమె ఏమాత్రం తన పారితోషికం తగ్గించలేదు, అటుఇటుగా కోటి రూపాయలు తీసుకుందని టాక్.