టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే…ఎదురులేని సమాధానం వస్తుంది. శ్రీలీల అంటూ. కుర్రకారు దగ్గర నుంచి హీరోలు, డైరక్టర్లు అందరి హాట్ ఫేవరెట్ శ్రీలీల నే.
మహేష్ బాబు సరసన హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీలకు మరో పెద్ద చాన్స్ వెదక్కుంటూ వచ్చినట్లు కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు హరీష్ శంకర్ చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి చివరి నుంచి సెట్ మీదకు వెళ్తుందీ సినిమా. మైత్రీ మూవీస్ నిర్మాతలు. ఈ సినిమాకు హీరోయిన్ గా శ్రీలీలను తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఆల్ మోస్ట్ శ్రీలీలను ఫైనల్ చేసినట్లే. ఇదే కనుక ఫిక్స్ అయితే శ్రీలీల క్రేజ్ మామూలుగా వుండదు.
ఇక టాప్ హీరోలు అందరితో ఒక రౌండ్ వేసేస్తుంది. అసలే సరైన హీరోయిన్ లేక దర్శకులు అంతా వెదుకులాడుతున్నారు. అందరికీ శ్రీలీల ఓ మాంచి క్రేజీ ఆప్షన్ లా కనిపిస్తోంది. ఢమాకా సినిమాలో డ్యాన్స్ లు, హుషారు అన్నీ కలిసి శ్రీలీల ను ఓ రేంజ్ లోకి చేర్చాయి.
నిజానికి ఉప్పెన తరువాత కృతి శెట్టి కి కూడా ఇలాంటి చాన్స్ వచ్చింది కానీ నిలబెట్టుకోలేకపోయింది. కానీ శ్రీలీల మాత్రం నిలబెట్టుకునేలా కనిపిస్తోంది. నటనలో, డ్యాన్స్ ల్లో ఆమె స్టామినా ఇప్పటికే ఒకటికి రెండు సార్లు ప్రూవ్ అయింది. రాబోయే ప్రాజెక్టులు అన్నీ క్రేజీ ప్రాజెక్టులే.