బుర్రా సాయి మాధవ్ మంచి మాటల రచయిత. అందులో సందేహం లేదు. క్రిష్, నాగ్ అశ్విన్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్, ఇలా చాలా మంది మెప్పు పొందిన రచయిత. సంభాషణ రచయితల్లో మంచి రెమ్యూనిరేషన్ అందుకుంటున్న రచయిత. అలాంటి వాడు దర్శకుడు త్రివిక్రమ్ ను ఒప్పించలేకపోయారు..మెప్పించలేకపోయారు. అన్నది ఇప్పుడు ఇన్ సైడ్ టాక్.
నిజానికి దీనికి రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి.
ఒకటేమిటంటే, సముద్రఖని వినోదయసితం రీమేక్ కు స్క్రిప్ట్ ఐడియా త్రివిక్రమ్ తయారు చేసుకున్నారు. దాని ప్రకారం సంభాషణలు రాయడానికి బుర్రా సాయి మాధవ్ ను తీసుకున్నారు. కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే బుర్రా తన వెర్షన్ ఇచ్చారు. ఆ తరువాత బుర్రాకు పారితోషికం ఇచ్చి సెటిల్ చేసేసి పంపించారు. మరి ఆ వెర్షన్ వాడుతున్నారా? లేక త్రివిక్రమ్ తన వెర్షన్ రాసారా? అన్నది తెలియదు. ఇది ఒక సంగతి.
వినిపిస్తున్న రెండో సంగతి ఏమిటంటే, త్రివిక్రమ్ కావాలనే బుర్రా రాసిన వెర్షన్ బాలేదని, అతనికి డబ్బులు ఇచ్చి సెటిల్ చేయించేసారని, తను కరెక్షన్ చేసిన వెర్షన్ తో సినిమా షూట్ చేస్తున్నారని. స్క్రీన్ ప్లే, మాటలు, మార్పులు చేర్పులు అన్నీ తన పేరిటే వుండాలనే ఆలోచనతో త్రివిక్రమ్ ఇలా చేసారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏది నిజం అన్నది తెలియదు కానీ బుర్రా సాయి మాధవ్ కు సినిమా ప్రారంభానికి ముందే డబ్బులు ఫైనల్ సెటిల్ మెంట్ చేసేసారన్నది మాత్రం వాస్తవం అని తెలుస్తోంది.
ఏమిటో రాను రాను టాలీవుడ్ లో పైకి చెప్పకున్నా, చెప్పుకోలేకున్నా త్రివిక్రమ్ బాధితుల సంఖ్య పెరుగుతోందేమో?