తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కళాతపస్వి కే. విశ్వనాథ్ (92) మరణించిన రోజుల వ్యవధిలోనే ఆయన భార్య జయలక్ష్మి కూడా అనంతలోకాలకు చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6.15కు జయలక్ష్మి మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు.
Advertisement
కె. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. అమ్మాయి పద్మావతి దేవి, అబ్బాయిలు కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్. కె. విశ్వనాథ్ ఈ నెల ప్రారంభంలోనే మరణించారు. తండ్రి మరణించిన కొన్ని రోజులకే తల్లి కూడా మరణించడంతో వారి పిల్లలు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు.