ఖమ్మంలో దారుణం.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పు

ఓవైపు హథ్రాస్ లాంటి ఘటనలతో దేశం అట్టుడికిపోతుంటే.. మరోవైపు ఆ తరహా కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది ఖమ్మంలో జరిగిన ఓ దురాగతం. డబ్బుందనే అహం, ఏదైనా చేయొచ్చనే…

ఓవైపు హథ్రాస్ లాంటి ఘటనలతో దేశం అట్టుడికిపోతుంటే.. మరోవైపు ఆ తరహా కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది ఖమ్మంలో జరిగిన ఓ దురాగతం. డబ్బుందనే అహం, ఏదైనా చేయొచ్చనే కండకావరంతో ఓ దుర్మార్గుడు.. తన ఇంట్లో పనిచేస్తున్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయబోయాడు. ప్రతిఘటించడంతో ఏకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.

ఖమ్మంలోని ముస్తాఫా నగర్ కు చెందిన సుబ్బారావు-రాములమ్మ ఇంట్లో 13 ఏళ్ల బాలిక పని చేస్తోంది. బాలికపై ఎప్పట్నుంచో కన్నేసిన ఇంటి ఓనర్ కొడుకు.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించాడు.

బాలిక గట్టిగా కేకలు వేయడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో బాలిక బయటకు పరుగెత్తుకొచ్చింది. చుట్టుపక్కల స్థానికులు బాలికను వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులు అవుతోంది. విషయం బయటకు చెబితే చంపేస్తామని.. ఆ సంపన్న కుటుంబం బెదిరింపులకు దిగడంతో ఇన్నాళ్లూ ఇది వెలుగులోకి రాలేదు. 70శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారడంతో విషయం బయటకొచ్చింది.

పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదుచేశారు. ఈ కేసును జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో.. ఏమాత్రం అలసత్వం వహించినా అది పోలీస్ వ్యవస్థకే మచ్చగా మారుతుంది.

వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి