కామెడీ ‘భువన విజయమ్’

కమెడియన్, హీరో, విలన్ ఇప్పుడు లేటెస్ట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్. చకచకా సినిమాలు చేస్తున్నాడు. చిన్న, పెద్ద అన్నది లేదు. లేటెస్ట్ గా తను, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో ఓ సినిమా మొదలైంది. …

కమెడియన్, హీరో, విలన్ ఇప్పుడు లేటెస్ట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్. చకచకా సినిమాలు చేస్తున్నాడు. చిన్న, పెద్ద అన్నది లేదు. లేటెస్ట్ గా తను, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో ఓ సినిమా మొదలైంది. 

అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాగా తెరెక్కుతున్న దీనికి భువన విజయమ్ అనే మాంచి టైటిల్ పెట్టారు. దీనికి యలమంద చరణ్ దర్శకుడు. ఇటు సునీల్, వెన్నెల కిషోర్ లతో పాటు కమెడియన్లు శ్రీనివాసరెడ్డి, ధనరాజ్, వైవా హర్ష, పృధ్వీ కూడా వున్నారు.

షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదలచేసారు. టోటల్ స్టార్ కాస్ట్ అంతా లుక్ లో కనిపిస్తున్నారు. పైగా ఒక్కొక్కరు ఒక్కో వైవిధ్యమైన ఎక్స్ ప్రెషన్ తో కనిపించడం విశేషం. మొత్తం మీద ఓ చిన్న సినిమాకు అట్రాక్షన్ వచ్చేలా ఫస్ట్ లుక్ ని ఆసక్తికరంగా డిజైన్ చేశారు.

 ఈ చిత్రానికి కిరణ్, విఎస్కే నిర్మాతలు. శేఖర్ చంద్ర మ్యూజిక్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానంది.