ఇదే చిట్టచివరి అవకాశం

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సెల్ఫీ సినిమా ఘోరంగా దెబ్బతింది. మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఎంతలా అంటే, మార్నింగ్ షో టాక్ తో సెకెండ్ షోకు థియేటర్లు ఖాళీ…

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సెల్ఫీ సినిమా ఘోరంగా దెబ్బతింది. మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఎంతలా అంటే, మార్నింగ్ షో టాక్ తో సెకెండ్ షోకు థియేటర్లు ఖాళీ అయ్యాయి. అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకున్న ఆడియన్స్ కూడా రద్దు చేసుకున్నారు. అక్షయ్ కుమార్ స్టార్ డమ్ కు ఘోర అవమానంగా నిలిచింది ఈ సినిమా.

మొదటి రోజు సెల్ఫీ సినిమాకు ఘోరంగా 2 కోట్ల 55 లక్షల రూపాయల నెట్ (ఇండియా వైడ్) మాత్రమే వచ్చింది. ఇక రెండో రోజైన శనివారం ఈ సినిమాకు 3 కోట్ల 80 లక్షల రూపాయల నెట్ వచ్చింది. అలా 2 రోజుల్లో ఈ సినిమా 6 కోట్ల 35 లక్షల రూపాయల బిజినెస్ మాత్రమే చేసింది.

వంద కోట్ల హీరోగా పేరుతెచ్చుకున్న అక్షయ్ కుమార్ తాజా చిత్రం ఇలా దయనీయ స్థితికి చేరుకుంది. ఇక ఈ సినిమాకు మిగిలిన ఒకే ఒక్క అవకాశం ఈరోజు మాత్రమే. ఈరోజు వచ్చే వసూళ్లే ఈ సినిమాకు చివరి కలెక్షన్లుగా ట్రేడ్ చెబుతోంది. నార్త్ బెల్ట్ లో సోమవారం నుంచి ఈ సినిమా దాదాపు సగం థియేటర్ల నుంచి తప్పుకునే అవకాశం ఉందంటున్నారు.

మరోవైపు సెల్ఫీ సినిమా దారుణ పరాజయానికి పూర్తిబాధ్యత వహించాడు అక్షయ్ కుమార్. ఇది తనకు కొత్త అనుభవం కాదని, ఇంతకుముందు కూడా తన కెరీర్‌లో ఇలాంటి దశలు ఉన్నాయని స్పష్టం చేసిన ఈ స్టార్ హీరో.. తననుతాను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.