బాలయ్య-బోయపాటి సినిమా వుంటుందా?

2019 ఆరంభంలో కథానాయకుడు..మహానాయకుడు. బిగ్గెస్ట్ డిజాస్టర్లు.  వాటి దెబ్బకి దర్శకుడు క్రిష్ పేరు కూడా పాడయిపోయింది.2019 చివరలో మళ్లీ మరో డిజాస్టర్. బాలయ్య రూలర్ రూపంలో.ఇప్పటికైనా బాలయ్య గమనించాలి. తను చేసే రొడ్డ కొట్టుడు…

2019 ఆరంభంలో కథానాయకుడు..మహానాయకుడు. బిగ్గెస్ట్ డిజాస్టర్లు.  వాటి దెబ్బకి దర్శకుడు క్రిష్ పేరు కూడా పాడయిపోయింది.2019 చివరలో మళ్లీ మరో డిజాస్టర్. బాలయ్య రూలర్ రూపంలో.ఇప్పటికైనా బాలయ్య గమనించాలి. తను చేసే రొడ్డ కొట్టుడు సినిమాలకు కాలం చెల్లింది అని.

జనం రాను రాను తన సినిమాలకు దూరంగా జరుగుతున్నారని. ఓపెనింగ్స్ రావడం కష్టం అవుతోందని,. వచ్చిన నిల్చోవడం అంటే అంతకన్నా కష్టం అని.ఇలాంటి టైమ్ లో మారాలి. నాగ్, వెంకీల మాదిరిగా మల్టీ స్టారర్ లు చేయాలి. పెద్ద మనిషి తరహా పాత్రలు చేసుకోవాలి. కానీ ఇంకా పాటలు, ఫైట్లు, డ్యాన్స్ లు అంటే జనం చూసే ట్రెండ్ లేదు ఇప్పుడు.అది వాస్తవం.

ఇలాంటి నేపథ్యంలో బోయపాటి-బాలయ్య ల సినిమా పరిస్థితి ఏమిటి అన్న క్వశ్చన్లు వినిపిస్తున్నాయి. 70 కోట్లకు రూపాయి బడ్జెట్ తగ్గదు ఈ సినిమాకు అన్నది ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తున్న విషయం. బాలయ్య మీద 70 కోట్లు పెట్టే ధైర్యం మైత్రీ తదితర సంస్థలు చేయకపోవడంతో మిరియాల రవీందర్ రెడ్డి దగ్గరకు వచ్చింది ప్రాజెక్టు.

బాలయ్య కూడా పది కోట్ల రెమ్యూనిరేషన్ కు తగ్గడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎంత బోయపాటి కాంబినేషన్ అన్నా సినిమా మార్కెట్ అవుతుందా? అన్నది అనుమానం. బోయపాటి -రామ్ చరణ్ కాంబినేషన్ నే దారుణంగా ఫెయిల్ అయింది. ఇంక బాలయ్యతో ఎలా వుంటుందో? అద్భుతం అనుకున్న కథనాయకుడు-మహానాయకుడు నే ఆడలేదు. బయ్యర్లు అంతా కుదలేయిపోయారు. రూపాయి వెనక్కు ఇవ్వలేదు.

ఇలాంటి నేపథ్యంలో బోయపాటి-బాలయ్య సినిమా విషయంలో పునరాలోచనలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా క్యాన్సిల్ అవుతుందా ? లేక బోయపాటి బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవుతారా? 
ఎంత కాంప్రమైజ్ అయినా బాలయ్య సినిమాకు ముఫై కోట్ల మార్కెట్ కూడా లేదు ఇప్పుడు.అందువల్ల బడ్జెట్ కన్నా వేరే ఆప్షన్ నే ఎంచుకుంటారేమో? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.