150 టికెట్ పై ఆర్డీవో ఆగ్రహం

ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. టికెట్ రేట్లు తగ్గించేసారు.సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు అని. కానీ మరోపక్క తగ్గించిన రేట్లు అమ్మకుండా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు సినిమాలకు గట్టి నెంబర్లు కనిపిస్తన్తున్నాయి. ఈ నేపథ్యంలో…

ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. టికెట్ రేట్లు తగ్గించేసారు.సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు అని. కానీ మరోపక్క తగ్గించిన రేట్లు అమ్మకుండా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు సినిమాలకు గట్టి నెంబర్లు కనిపిస్తన్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచించి రేట్లు ఇచ్చేస్తే బెటర్ అన్న ఆలోచన చేయడం లేదు.

ఇదిలా వుంటే నెల్లూరు జిల్లాలో ఈవారం విడుదల కాబోయే భారీ సినిమా కోసం 150 రూపాయల రేట్లు పెట్టి, ఆన్ లైన్ లోనే అమ్మేసారట. ఆ స్క్రీన్ షాట్ లు పై దాకా వెళ్లిపోవడంతో పరిస్థితి వికటించినట్లు తెలుస్తోంది. 

ఆ ధియేటర్ లను ఆర్డీవో సందర్శించి, తక్షణం అధికంగా అమ్మిన రేట్లను ప్రేక్షకులకు వెనక్కు ఇవ్వమని ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై లోకల్ ఎమ్మెల్యే కలుగచేసుకుని సర్దుబాటు చేస్తున్నట్లు బోగట్టా. మొత్తం మీద టికెట్ రేట్ల వ్యవహారం వ్రతమూ చెడింది..ఫలితమూ దక్కలేదు అన్నట్లు తయారైంది. అటు ప్రభుత్వ మనోగతం నెరవేరడం లేదు.

ఇటు బయ్యర్లు బాగుపడడం లేదు. మధ్యలో అధికారులు బాగుపడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు నూరు, నూటా యాభై పెట్టి కొనడానికి సిద్దంగా వున్నపుడు వదిలేస్తే సరి కదా?