సోలో బతుకే సో బెటరూ అంటూ సినిమా చేస్తున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో హ్యాపీగా పెళ్లి చేసుకోబోతున్నాడు. వాస్తవానికి ఆ సినిమా కాన్సెప్ట్ కూడా అదే.
సోలో బతుకే సో బెటరూ అనుకునే హీరో, హీరోయిన్ ప్రేమలో పడడం. సరే, ఆ సంగతి అలా వుంచితే టాలీవుడ్ లోని బ్యాచులర్ హీరోలు ఒక్కొక్కరూ పెళ్లి బాట పడుతున్నారు. రానా, నిఖిల్, నితిన్ అయిపోయారు. ఇప్పడు సాయి ధరమ్ తేజ్ వంతు వచ్చింది.
అమ్మ చూసి, మెచ్చి, కుదిర్చిన బంధువుల ఇంటి అమ్మాయినే సాయితేజ్ చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ముందుగా సాయితేజ్ ఫ్యామిలీ చూసిన తరువాత సంబంధాన్ని మేనమామ మెగాస్టార్ దృష్టికి తీసకెళ్లారని, ఆయన కూడా ఓకె అన్నారని తెలుస్తోంది.
ఈ అక్టోబర్-నవంబర్ ల్లో చేసుకుందాం అనుకున్నారు కానీ సరైన ముహుర్తం సెట్ కావడం లేదని, 2021 వేసవిలో పెళ్లి వుండే అవకాశం వుందని తెలుస్తోంది. అమ్మాయి వివరాలు, మరిన్ని సంగతుల మరో వార్తలో..వెయిట్ అండ్ వాచ్.