పుష్ప సినిమాలో సమంత ఐటెంసాంగ్ చేసింది. “ఊ అంటావా.. ఊఊ అంటావా” అంటూ రిలీజ్ చేసిన ప్రోమో కూడా ఓ ఊపు ఊపుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ పై పుష్ప హీరోయిన్ రష్మిక స్పందించింది. తను హీరోయిన్ గా నటించిన సినిమాలో సమంత ఐటెంసాంగ్ చేయడం, తనకు చాలా హ్యాపీగా ఉందంటోంది. పైగా సమంతలా తను చేయలేనని కూడా చెబుతోంది.
“నా సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆమెకు నేను మెసేజ్ కూడా చేశాను. సాంగ్ లో చాలా బాగున్నావని మెచ్చుకున్నాను. సమంత ఈ సాంగ్ చేయడం చాలా గ్రేట్. ఎందుకంటే, నాకే స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను. అలాంటిది స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా సమంత ఈ సాంగ్ చేసింది.”
పుష్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రష్మిక.. మరో ఆసక్తికర విషయాన్ని కూడా బయటపెట్టింది. కథ ఏంటి, క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని కూడా అడక్కుండా.. పుష్ప సినిమాకు సైన్ చేసిందట. కేవలం చిత్తూరు యాస నేర్చుకోవాలనే అంశాన్ని మాత్రమే సుకుమార్, ఆమెకు చెప్పాడట.
“పుష్ప సినిమా స్క్రిప్ట్, క్యారెక్టర్ ఏంటనేది నాకు తెలీదు. సుకుమార్ ప్రపంచంలోకి ఎంటర్ అవ్వాలనేది నా కోరిక. అందుకే ఓకే చెప్పాను. సుకుమార్ కు పూర్తిగా సరెండర్ అయ్యాను. ఆయన చెప్పినట్టు చేశానంతే. ఈ సినిమా కోసం చిత్తూరు యాస నేర్చుకోవాలన్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకున్నాను, మళ్లీ చిత్తూరు యాస ఒకటి నేర్చుకోవాలా అని బాధపడ్డాను. కానీ సుకుమార్ సర్ కోసం కష్టపడి నేర్చుకున్నాను.”
పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో కనిపించనుంది రష్మిక. ఈ పాత్రను డీ-గ్లామరైజ్డ్ రోల్ అంటే ఆమె ఒప్పుకోవడం లేదు. అందులో కూడా ఓ గ్లామర్ ఉంటుందని, కాకపోతే మేకప్ లేకుండా అత్యంత సహజంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.