నాని హీరోగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగ రాయ్. డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.
శ్యామ్ సింగరాయ్ కథ రెండు టైమ్ పీరియడ్స్‌కు సంభందించింది. గతం, వర్తమానం అంటూ రెండు భాగాల్లో ఈ కథ జరుగుతుంది. గతంలో 70వ దశకంలోని వాతావరణాన్ని ఇందులో చూపించనున్నారు. దానికి తగ్గట్టే సంగీతం, నేపథ్య సంగీతం అందించాను. నాకు ఇండియన్ ఇన్‌స్ట్రుమెంట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఆ కాలంలో ఉపయోగించిన వాయిద్యాలనే ఇందులో ఎక్కువగా ఉపయోగించాం. తబల, సితార్, సంతూర్ వంటి వాటిని వాడి సంగీతాన్ని అందించాను.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో నార్త్, సౌత్ ఫ్లేవర్ కలిసి ఒక కొత్త ఫ్లేవర్ ఉంటుంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్ కాబట్టి బెంగాల్ సంగీతాన్ని కూడా ఇందులో జోడించాం. కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ చేశాను. టాలీవుడ్‌లో ఇలాంటి నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా ఇదే అవుతుంది.
కథ వినగానే చాలా ఎగ్జయిట్ ఫీలయ్యా…ఎందుకంటే ఈ సినిమాకు మంచి సంగీతం అందించే స్కోప్ ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చెయ్యొచ్చు అనిపించింది. ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా రిలీజయ్యాక పాటలకు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు మరింత మంచి స్పందన వస్తుందని నమ్ముతున్నాను.
సిరివెన్నెల లాంటి లెజెండ్‌తో పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో గడిపిన ప్రతి మూమెంట్ ఒక మెమరబుల్. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఆయన రెండు పాటలు రాశారు. అందులో సిరివెన్నెల పాట ఆల్రెడీ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. ఆయన రాసిన ఇంకో పాట త్వరలో విడుదల కాబోతుంది. ఆ పాటలో సిరివెన్నెలగారి సాహిత్యం అద్బుతంగా ఉంటుంది. ఆ పాటను కంపోజ్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది.