భీమ్లానాయక్ పై వత్తిడి పెరిగింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా నటించిన భారీ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఏనాడో విడుదల కోసం డేట్ వెేసుకుని కూర్చుంది. సంక్రాంతి 2022 విడుదల. అయితే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి సినిమాలు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా నటించిన భారీ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఏనాడో విడుదల కోసం డేట్ వెేసుకుని కూర్చుంది. సంక్రాంతి 2022 విడుదల. అయితే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి సినిమాలు అన్నీ ఒకేసారి విడుదలకు వచ్చేసాయి. 

బంగార్రాజు కూడా వస్తా అంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలో భీమ్లా నాయక్ మీద డేట్ వాయిదాకు ఒత్తిడి పెరిగింది. కానీ భీమ్లా నాయక్ హీరో పవన్ ససేమిరా అంటుండడంతో ఓ పీట ముడి పడిపోయి అలా వుండిపోయింది.

ఇప్పుడు విడుదల డేట్ నెల రోజుల్లోకి వచ్చింది. దీంతో ఒత్తిడి మరింత పెరిగింది. ఎలాగైనా భీమ్లా నాయక్ ను వాయిదా వేయించాలని కోరుతూ రాధేశ్యామ్ నిర్మాత వంశీ, ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య వెళ్లి డైరక్టర్ త్రివిక్రమ్ ను కలిసారు. అయితే తన చేతుల్లో ఏం లేదని, తన ప్రయత్నం తాను చేస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

భీమ్లా నాయక్ కనుక వాయిదా పడితే ఆ ఎఫెక్ట్ చాలా సినిమాల మీద పడుతుంది. ఎఫ్ 3, సర్కారు వారి పాట లాంటి సినిమాలు కూడా వాయిదా పడతాయని వినిపిస్తోంది. పవన్ కళ్యాణ విశాఖ నుంచి ఈ రోజే తిరిగి వచ్చారు. వాయిదా నిర్ణయం తీసుకంటే ఆయనే ప్రకటించే అవకాశం వుంది. ఆ పైన యువి వంశీ, డివివి దానయ్య కృతజ్ఞతలు తెలిపే అవకాశం కూడా వుంది.