చావు పుట్టుకల మధ్య సెలబ్రేషన్.. రాధేశ్యామ్

రాధేశ్యామ్ స్టోరీలైన్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు రాథాకృష్ణ కుమార్. గ్రేట్ ఆంధ్రతో ఎక్స్ క్లూజివ్ తో మాట్లాడిన ఈ దర్శకుడు.. జాతకానికి, ప్రేమకథను ముడిపెట్టి సినిమా తీసిన విషయాన్ని బయటపెట్టాడు Advertisement…

రాధేశ్యామ్ స్టోరీలైన్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు రాథాకృష్ణ కుమార్. గ్రేట్ ఆంధ్రతో ఎక్స్ క్లూజివ్ తో మాట్లాడిన ఈ దర్శకుడు.. జాతకానికి, ప్రేమకథను ముడిపెట్టి సినిమా తీసిన విషయాన్ని బయటపెట్టాడు

“ఇంటెన్స్ ప్రేమకథ. ప్రమోషన్స్ లో మీరు చూసినట్టు అబ్బాయి-అమ్మాయి మధ్య రొమాన్స్ మాత్రమే కాదు ఈ సినిమా. ఈ కథను నేను లైఫ్ అండ్ డెత్ మధ్య పార్టీగా చెబుతాను. జీవితానికి, చావుకు మధ్య పార్టీ జరిగితే ఎలా ఉంటుందో రాధేశ్యామ్ అలా ఉంటుంది. ఎమోషన్స్ పరంగా ఇది అతిపెద్ద సినిమా. జాతకాల్ని నమ్మేవాళ్లు ఉన్నారు, అస్సలు నమ్మని వాళ్లు కూడా ఉన్నారు. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది ఎప్పుడూ డిస్కషన్ పాయింట్. దీని మధ్యలోకి ప్రేమను తీసుకొస్తే ఎలా ఉంటుందనేది నా ఆలోచన. అదే రాధేశ్యామ్.”

మరి ఈ సినిమాకు వింటేజ్ యూరోప్ బ్యాక్ డ్రాప్ ను ఎందుకు తీసుకున్నారు? అసలు ఇది ఎవరి ఆలోచన? దీనికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు. ఆ క్రెడిట్ మొత్తం ప్రభాస్ దే అంటున్నాడు.

“కథ రాసుకున్నప్పుడే ఇది పెద్ద సినిమా. ప్రభాస్ వచ్చిన తర్వాత దీని రేంజ్ ఇంకా పెరిగింది. నిజానికి ఈ సినిమాను ఇండియాలోనే వింటేజ్ లుక్ తో తీయాలనేది నా బేసిక్ ఆలోచన. కానీ ప్రభాస్ మార్చేశారు. వింటేజ్ యూరోప్ బ్యాక్ డ్రాప్ లో చేస్తే బాగుంటుందని, ఇప్పటివరకు ఎవ్వరూ అది టచ్ చేయలేదని చెప్పారు. వెంటనే ఓకే చెప్పాను. నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు.”

15 ఏళ్లుగా రాధేశ్యామ్ కథతో ట్రావెల్ అవుతున్నానని ప్రకటించిన రాథాకృష్ణ.. ఆ కథ పుట్టుక వెనక ఓ ఆసక్తికరమైన విషయం ఉందన్నాడు. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పిన ఈ డైరక్టర్, సరైన టైమ్, సరైన వేదిక చూసి ఆ మేటర్ బయటపెడతానంటున్నాడు.