Advertisement

Advertisement


Home > Politics - Gossip

జ‌నసేన-దేశం..అడ్డంగా లోకేష్ ?

జ‌నసేన-దేశం..అడ్డంగా లోకేష్ ?

2024 ఎన్నికల నాటికి వైకాపాను దాని అధినేత వైఎస్ జ‌గన్ ను ఎదుర్కోవడానికి జ‌నసేనతో తెలుగుదేశం పొత్తు అనివార్యం అని గత కొంతకాలంగా వినిపిస్తూనే వుంది. 

గత ఎన్నికల్లో అనధికారికంగా పెట్టుకున్న పొత్తు పెద్దగా ఫలించలేదు. అందుకే ఈసారి అధికారికంగా పొత్తు పెట్టుకుంటారని రాజ‌కీయ వర్గాల్లో బలంగా వినిపిస్తూనే వుంది. 

జ‌నసేన అండ లేకుండా తెలుగుదేశం అధికారం సాధించడం, జ‌గన్ ను నిలువరించడం అంత సులువు కాదని తెలుగుదేశం, దాని మద్దతు సామాజిక వర్గం భావిస్తోంది. పవన్ ఇమేజ్ ను వాడుకుని అదికారం సంపాదించేస్తే ఆ తరువాత సంగతి అప్పుడు చూసుకోవచ్చని తెలుగుదేశం భావిస్తోందని కూడా వార్తలు వినిపించాయి. 

అందుకే తెలుగుదేశం అనుకూలం మీడియా పవన్ కళ్యాణ్ ను వీలయినంత ఎలివేట్ చేయడానికే చూస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రాజ‌కీయ వర్గాల్లో కొత్త గ్యాసిప్ లు కూడా వినిపిస్తున్నాయి. 

జ‌నసేనతో పొత్తు అన్నది తెలుగుదేశం యువనేత లోకేష్ కు అంతగా ఇష్టం లేదన్నది ఆ గ్యాసిప్ ల సారాంశం. చంద్రబాబు మాత్రం జ‌నసేనతో పొత్తు కోసం చూస్తున్నారని, లోకేష్ మాత్రం వద్దంటున్నారని రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అవసరం అయితే మరోసారి ప్రతిపక్షంలో కూర్చుంద్దాం. ఆ తరువాత జ‌నమే గెలిపిస్తారు. ఇప్పుడు జ‌నసేన‌తొ పొత్తు పెట్టుకుంటే మైనస్ నే తప్ప ప్లస్ కాదన్నది లోకేష్ ఆలోచనగా తెలస్తోంది. ఎప్పటికైనా స్వంత కాళ్ల మీద, స్వంత బలం మీద ఆధారపడదామని లోకేష్ పట్టుదలగా వున్నారని తెలుస్తోంది.

నిజానికి ఇది జ‌గన్ ఆలోచనా ధోరణి. జ‌నసేన విషయంలో ఆయన అలాగే వున్నారు. ఎవ్వరితో పొత్తు వద్దని ఒంటరిగానే బలం పెంచుకోవాలన్నది జ‌గన్ స్ట్రాటజి. ఇప్పుడు లోకేష్ కూడా అదే ధోరణిలో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?