నాగచైతన్యతో సమంత విడిపోవడంపై ఎవరికి తోచిన విధంగా వారు భాష్యం చెబుతున్నారు. ఒక దశలో సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా సాగుతున్న ట్రోలింగ్‌పై ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను అసభ్యంగా చిత్రీకరించిన వీడియోలను తొలగించేలా న్యాయస్థానం నుంచి ఉపశమనం పొందారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్యతో విడిపోవడంపై మరోసారి నోరు తెరిచారు. మనసులో మాటను బయటపెట్టారు. ఇకపై విడాకుల గురించి స్పందించనని తేల్చి చెప్పారు. నాగచైతన్యతో విడాకులపై సమంత మాటల్లోనే…
‘మేమిద్దరం విడిపోవడంపై చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఆ మొత్తం వ్యవహారంపై నా అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పేశాను. కాబట్టి, ఇప్పుడు మళ్లీ మళ్లీ ఆ విషయంపై స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను’ అని సమంత పేర్కొన్నారు.
ఇదిలా వుండగా సమంతతో విడిపోవడంపై నాగచైతన్య ఇంత వరకూ ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం. విడిపోతున్నట్టు ఇద్దరూ సంయుక్తంగా సోషల్ మీడియాలో ప్రకటించడం మినహా, నాగచైతన్య వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, మరోవైపు సమంత ఒకటికి రెండుసార్లు తన గోడు వినిపించడం విశేషం.