తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ల వ్యవహారం రోజురోజుకూ కంగాళీగా మారుతోంది! ఎంతలా అంటే.. ఆఖరికి తిక్కారెడ్డి వ్యవహారాలను కూడా రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు నాయుడు, లోకేష్ లు పరితపిస్తున్న వైనాన్ని చూస్తే.. తెలుగుదేశాన్ని వీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారనే ఆశ్చర్యం కలగక మానదు.
తిక్కారెడ్డిపై దాడి వ్యవహారం గురించి ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖేదో రాశారట. అయినా ఉదయం లేస్తే తిట్టేది ఆ డీజీపీనే. మళ్లీ ఆయనకే మొరపెట్టుకుంటుకున్నారు. తెలుగుదేశం నేతలకు ఏపీ పోలీసులు సరిగా కాపలా ఉండటం లేదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారట.
వాస్తవానికి సదరు తిక్కారెడ్డి వివాదాస్పద వ్యక్తి. గతంలో కూడా ఆయన ఇలాంటి రచ్చలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో మంత్రాలయం నియోజకవర్గం పరిధిలో ప్రచారానికి వెళ్లిన తిక్కారెడ్డి అక్కడ భీభ్సతం సృష్టించారు. ఒక గ్రామంలో తన ప్రచారాన్ని ప్రజలు అడ్డుకుంటారనే నెపంతో గన్ మెన్ చేత కాల్పులు జరిపించిన ఘనత ఈయనది. ఏకంగా పది రౌండ్ల కాల్పులను జరిపారు తిక్కారెడ్డి గన్ మెన్. ఆ కాల్పులు అటు తిరిగి ఇటు తిరిగి తిక్కారెడ్డినే గాయపరిచాయి!
నాటి కాల్పుల్లో ఏఎస్ఐ కూడా ఒకరు గాయపడ్డారు. అలా సొంత గన్ మెన్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు తిక్కారెడ్డి. అదృష్టవశాత్తూ ఆయనకు ఏం జరగలేదు. ఇప్పుడేమో తనపై గతంలో కాల్పులు జరిపి హత్యాయత్నం చేశారని ఆయన చెబుతున్నారు.
అప్పుడు కాల్పులు జరిపిందే నీ గన్ మెన్ స్వామీ.. అంటూ ఆయనకు ఎవరూ గుర్తు చేయడం లేదేమో! తమరే గ్రామస్తులపై కాల్పులు జరిపించబోయి.. తమరే గాయపడ్డారని ఎవరూ తట్టడం లేదేమో! తను చేయించిన ఘనకార్యాన్ని కూడా తనపై దాడిగా చెప్పుకుంటున్నారు సదరు తిక్కారెడ్డి.
ఆ తిక్కారెడ్డికి చంద్రబాబు, లోకేష్ లు తోడయ్యారు. వీళ్ల తీరు చూస్తుంటే.. మరీ ఇంత తిక్క మనుషులేంటబ్బా అనిపించకమానదు సామాన్యుడికి!