తెలంగాణ బీజేపీలో భారీ కుదుపు. స్వయంగా పార్టీ అధ్యక్షుడికి చెందిన జిల్లాలో రాసలీలలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రాసలీలలు లీక్ అవ్వడంతో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇరుకునపడ్డారు. వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నుంచి సత్యనారాయణను తొలిగించారు.
కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణపై చాలా రోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. తన పదవిని అడ్డం పెట్టుకొని మహిళా కార్యకర్తల్ని ఈయన లోబరుచుకుంటారని.. అలా లొంగిన మహిళలకే ఆయన ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో కరీంనగర్ లో ఉంది. తాజాగా లీకైన వీడియోలు చూస్తే ఆ ప్రచారం నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడింది.
తన అలవాటు ప్రకారం.. ఈసారి కూడా సత్యనారాయణ మరో మహిళా కార్యకర్తతో బేరం కుదుర్చుకున్నాడు. అయితే ఈసారి మాత్రం సదరు మహిళ అందరిలా ఊరుకోలేదు. తనను బెడ్ రూమ్ కు పిలిచిన సత్యనారాయణ నగ్న స్వరూపాన్ని సీక్రెట్ కెమెరా సాయంతో బట్టబయలు చేసింది. అక్కడితో ఆగకుండా తనతో సత్యనారాయణ మాట్లాడిన ఆడియో టేపుల్ని కూడా బయటపెట్టింది.
నిజానికి ఈ వ్యవహారం కొన్ని రోజుల కిందటే బయటపడింది. విషయం తెలుసుకున్న సత్యనారాయణ, ఓ పోలీస్ అధికారి సహాయంతో రాయబారం నడిపాడు. రాజీ కోసం ప్రయత్నించాడు. అయితే ఇలాంటి విషయాలు ఓ పట్టాన దాగవు కదా. ఏకంగా రాష్ట్ర అధిష్టానం దృష్టికి వెళ్లాయి. దీంతో సత్యనారాయణ పదవి ఊడింది.