పెంగ్వీన్..వి.. కన్నా డిజాస్టరా?

ఒకేసారి రెండు తెలుగు సినిమాలు ఓటిటిలో విడుదలయ్యాయి. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా, అనుష్కల నిశ్శబ్దం సినిమాలు రెండూ క్రిటిక్స్ నుంచి మంచి స్పందనను అందుకోలేదు. అంత వరకు బాగానే వుంది. Advertisement కానీ…

ఒకేసారి రెండు తెలుగు సినిమాలు ఓటిటిలో విడుదలయ్యాయి. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా, అనుష్కల నిశ్శబ్దం సినిమాలు రెండూ క్రిటిక్స్ నుంచి మంచి స్పందనను అందుకోలేదు. అంత వరకు బాగానే వుంది.

కానీ ఓటిటిలో ఇవే తొలి దారుణ పరాజయాలు అన్నట్లుగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వార్తలు వండి వార్చడం విశేషం. అంతే కాదు, ఇలాంటి సినిమాలు కొనడం వల్ల అమెజాన్ ఘోరమైన నష్టాలు మూటకట్టేసుకుంటోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

చిత్రమేమిటంటే తెలుగునాట భారీ అమౌంట్ కు కొన్న సినిమా వి. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ అయింది. అప్పుడు ఎవ్వరూ ఎలాంటి ఆవేదన వ్యక్తం చేయలేదు అమెజాన్ మీద. అప్పుడు డే వన్ నుంచి అమెజాన్ మీద ఎలాంటి సానుభూతి కనిపించలేదు. అంతకన్నా ముందు పెంగ్విన్, ఇంకా మరి కొన్ని తమిళ సినిమాలు కొని బోలెడు హడావుడి చేసింది అమెజాన్.

అప్పుడూ ఎవ్వరూ అయ్యో..అమెజాన్ అనలేదు. నలభై కోట్ల రేంజ్ లో వి కొన్నపుడు లేని ఈ బాధ పాతిక కోట్ల రేంజ్ లో నిశ్శబ్దం కొన్నపుడు ఎందుకు వస్తోంది అన్నది అనుమానం. దీని వెనుక ఏదో వ్యవహారం వుందనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 

నిజానికి అమెజాన్ లాంటి వేల వేల కోట్ల స్టామినా వున్న సంస్థకు ఇవేమీ పెద్ద షాక్ లు కావు. వాళ్ల స్ట్రాటజీ వేరు. ప్రతి నెల కొత్త సబ్ స్క్రిప్షన్లు వచ్చి పడిపోవు. పైగా ఇప్పటికే నాలుగున్నర మిలియన్ల తెలుగు సబ్ స్క్రయిబర్లు వున్న అమెజాన్ కు మరీను. కానీ ప్రతి నెల రెన్యూవల్స్ వుంటాయి. అలా రెన్యూవల్స్ రావాలంటే ఏదో ఒక అట్రాక్షన్ వుండాలి. అందుకోసం అమెజాన్ ఈ ఖర్చు పెడుతుంది.

ఓ రెండున్నర లక్షల మంది నిశ్శబ్దం కోసం రెన్యూవల్ చేసుకుంటే అమెజాన్ డీల్ సక్సెస్ అయిపోయినట్లే. పైగా ఇప్పటి వరకు చందాలు కట్టిన వారికి ప్రతి నెలా తెలుగు కంటెంట్ అందించాల్సిన బాధ్యత అమెజాన్ మీద, అందుకోవాల్సిన హక్కు మెంబర్లకు వుంటుంది. అందుకోసం కూడా హిట్ నా ఫట్ నా అన్నది చూడకుండా సినిమాలు విడుదలవుతూ వుండాల్సిందే. పైగా అమెజాన్ కు ప్రయిమ్ మెంటర్ షిప్ అన్నది కేవలం సినిమాల కోసం కాదు. షాపింగ్ కోసం కూడా. దాని మీద వచ్చే ఆదాయం అపరిమితం. అలాగే అమెజాన్ పే యాప్ ను కూడా పాపులారిటీలోకి తేవాలి. 

ఇవన్నీ కలిపి చూసుకుంటే అమెజాన్ కు పోయేది ఏమీ లేదు. మెంబర్లకు పోయిందీ లేదు. ఎటొచ్చీ సినిమా బాగుంటే ఆ డైరక్టర్ కు, కాస్టింగ్ కు మరిన్ని చాన్స్ లు వస్తాయి. అదే మైనస్. వారికే మైనస్.  వార్తల, ట్వీట్ల  విషయంలో కాన్సన్ ట్రేట్ చేయాల్సింది ఆ పాయింట్ మీద. అది వదిలేసి, అయ్యో..అమెజాన్ అన్యాయమైపోతోందే, టాలీవుడ్ నిర్మాతలు సేఫ్ అయిపోతున్నారే అంటూ ఆవేదనపడడం అంటే ఎక్కడో ఏదో కొడుతూంది.