కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసి టీడీపీ కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ దాడి టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి జరిగిన తర్వాత టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు.
ఆసలేమి జరిగిందంటే రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోని స్వంత కొడుకు లోకేష్ నే గెలవలేదంటూ విమర్శించారు. తండ్రి ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా పని చేసినా 2019 ఎన్నికల్లో గెలవలేకపోయాడని ఎద్దేశా చేశారు. దీన్ని బట్టి లోకేష్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. తమ నియోజకవర్గాలను తాము కాపాడుకుని.. మిగిలిన వాళ్ల గురించి మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
లోకేష్ పై వ్యక్తిగతంగా విమర్శించారని గన్నవరం టీడీపీ నేతలు వంశీపై తీవ్ర విమర్శలు కురిపించి వంశీపై పోలీసులపై పిర్యాదు చేయడంతో.. మా నాయకుణ్నే విమర్శిస్తారా అంటూ వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.