షి ఈజ్ సో క్యూట్…రష్మిక

హీరోయిన్ రష్మిక ఆన్ ది స్క్రీన్ పై ఓ మ్యాజిక్ చేస్తుంది. ఏడవడం మినహా ఏం చే యించినా ఆమె తన హావభావాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆ టెక్నిక్ తెలిసిన దర్శకుడు ఎవరైనా సరే…

హీరోయిన్ రష్మిక ఆన్ ది స్క్రీన్ పై ఓ మ్యాజిక్ చేస్తుంది. ఏడవడం మినహా ఏం చే యించినా ఆమె తన హావభావాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆ టెక్నిక్ తెలిసిన దర్శకుడు ఎవరైనా సరే రష్మికను ప్రేక్షకుల మీదకు గ్లామర్ అస్త్రంగా సులువుగా ప్రయోగించేయవచ్చు. 

సరిలేరు నీకెవ్వరూ సినిమా నుంచి మరో సాంగ వచ్చింది. హి ఈజ్ సో క్యూట్ అంటే హీరో మహేష్ బాబును ఉద్దేశించి హీరోయిన్ రష్మిక పాడే పాట ఇది. 

కేరళ లోకేషన్లలో కలర్ ఫుల్ గా చిత్రీకరించడమే కాదు, రష్మికను చాలా చలాకీగా, అందంగా ప్రెజెంట్ చేసారు. కుచ్చి కుచ్చి కూనమ్మా పాటలో మనీషా కొయిరాలా ఎలా కనిపిస్తుందో అలాంటి గిరిజన గెటప్ లో కూడా రష్మికను చూపించారు. కుచ్చి కుచ్చి కూనమ్మా పాటకు, ఈ పాటకు కూడా కొరియాగ్రాఫర్ రాజు సుందరం నే కావడం విశేషం.

సినిమాలో గ్లామర్ టచ్ ఏ మేరకు వుంటుంది అన్నది ఈ సాంగ్ తో చిన్న శాంపిల్ చూపించారు. రష్మిక డ్యాన్స్ మూవ్ మెంట్లు కూడా బాగున్నాయి. కానీ దేవీశ్రీ విషయానికి వస్తే మాత్రం బాగా నలిగాల్సిన ట్యూన్ నే ఇచ్చారు తప్ప, ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ ను అయితే కాదు. మైండ్ బ్లాంక్ సాంగ్ లాగే వినగా..వినగా..క్లిక్ అవుతున్నట్లు, ఇది కూడా లాంగ్ రన్ లో క్లిక్ కావచ్చు.