రజనీ-పోటీ ఇచ్చేలాగే వున్నాడు

2020 సంక్రాంతికి భారీ పోటీ వుంది అన్న సంగతి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అటు మహేష్ బాబు, ఇటు బన్నీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో…

2020 సంక్రాంతికి భారీ పోటీ వుంది అన్న సంగతి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అటు మహేష్ బాబు, ఇటు బన్నీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రజనీ దర్బార్ సినిమాను ఎవరూ ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోలేదు. కానీ దర్బార్ ట్రయిలర్ బయటకు వచ్చాక వ్యవహారం కాస్త మారుతోంది. మురుగదాస్ డైరక్షన్ లో రజనీ కాంత్ చేసిన దర్బార్ సినిమా ట్రయిలర్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ అన్నదానికి డెఫినిషన్ లా వుంది.

రజనీ సినిమా నుంచి ఆయన ఫ్యాన్స్ కావచ్చు, సగటు సినిమా అభిమానులు కావచ్చు, ఏది ఆశిస్తారో అదే వుంది ట్రయిలర్ లో. పెద్దగా కథను రివీల్ చేయలేదు. హీరో బ్యాడ్ క్యాప్ అన్నది మాత్రం క్లారిటీ ఇచ్చారు. రజనీ చేసే ఫన్ మూవ్ మెంట్స్ అన్నీ సినిమాలో పక్కాగా వున్నాయి అన్నది స్పష్టమవుతోంది. 

నయనతార, రజనీ కలిసి చేసిన సీన్లు కూడా ట్రయిలర్ లో బాగానే పండాయి. సంక్రాంతికి వస్తున్న బన్నీ సినిమా క్లాస్ ఎంటర్ టైనర్. మహేష్ సినిమా మాస్ ఎంటర్ టైనర్. ఇప్పుడు ఈ దర్బార్ కూడా మాస్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లోకే వచ్చేలా వుంది. అందువల్ల సంక్రాంతి ఫుల్ హాట్ గా వుంటుందని స్పష్టమవుతోంది. ఎటొచ్చీ ఈ పోటీలో దర్బార్ కు దక్కే థియేటర్లు అన్నది అనుమానం.