బోయ‌పాటి, బాల‌య్య‌కు ఝ‌ల‌కిచ్చిన సోనాక్షి!

బాల‌కృష్ణ హీరోగా,  బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా తీసుకోబోతున్నారంటూ ఆ సినిమా వాళ్లే ఒక లీక్ ఇచ్చారు. బోయ‌పాటి గ‌త సినిమా ఫెయిల్యూర్ తో ఇప్పుడు ఆయ‌న…

బాల‌కృష్ణ హీరోగా,  బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా తీసుకోబోతున్నారంటూ ఆ సినిమా వాళ్లే ఒక లీక్ ఇచ్చారు. బోయ‌పాటి గ‌త సినిమా ఫెయిల్యూర్ తో ఇప్పుడు ఆయ‌న త‌న హిట్ పెయిర్ బాల‌య్య‌తో సినిమా చేస్తున్నా.. దానికి బ‌జ్ రావ‌డం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో బాలీవుడ్ హీరోయిన్ పేరు చెప్పి ఆ సినిమాకు ఊపు తీసుకురావ‌డానికి ఒక ట్ర‌య‌ల్ వేసిన‌ట్టుగా ఉన్నారు.

అయితే అలాంటి గాసిప్ అలా మొద‌లైందో లేదో.. ఇంత‌లోనే దాన్ని ఖండించేసింది సోనాక్షి. మంచి పీఆర్ టీమ్ నే మెయింటెయిన్ చేస్తోందో ఏమో కానీ.. సౌత్ లో వినిపించిన గాసిప్ కు నార్త్ నుంచి నో చెప్పింది షాట్ గ‌న్ త‌న‌య‌. 

ట్విట‌ర్ ద్వారా త‌నే అధికారికంగా స్పందిస్తూ.. త‌ను బాల‌కృష్ణ‌, బోయ‌పాటిల సినిమాలో న‌టిస్తున్న‌ట్టుగా జ‌రుగుతున్న ప్ర‌చారం అబ‌ద్ధ‌మ‌ని సోనాక్షి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టింది. త‌న త‌దుప‌రి సినిమా గురించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తానంటూ.. సోనాక్షి ఆ ట్వీట్ లోనే పేర్కొంది. మొత్తానికి సంజ‌య్ ద‌త్, సోనాక్షి సిన్హా అంటూ.. బోయ‌పాటి స్టార్ల పేర్ల‌ను లీక్ లుగా ఇస్తుంటే.. సోనాక్షి  ఆదిలోనే రూమ‌ర్ల‌కు చెక్ పెట్టింది. అస‌లే బాల‌కృష్ణ‌కు హీరోయిన్ ల ఎంపిక క‌ష్టం గా మారిన‌ట్టుగా ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో సోనాక్షి ఇలా తేల్చేసింది. ఇక నెక్ట్స్ ఎవ‌రో!