తెలుగుదేశం పార్టీ భావి నేత, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తనయుడు అయిన నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రలో సాగుతూ ఉన్నారు. ఈ పాదయాత్ర మొదలై దాదాపు ఇరవై రోజులు అయిపోయి, నెల కావొస్తున్నా.. సగటు రాజకీయ పరిశీలకుడికి ఈ యాత్ర ఉద్ధేశం ఏమిటి? ఇందు మూలంగా లోకేష్ ఏం చెప్పదలుచుకున్నారనేది అంతుబట్టని అంశంగా ఉంది. ఇప్పటి వరకూ తెలుగు రాజకీయాల్లో పలువురు నేతలు పాదయాత్రలు చేశారు. ఆయా సందర్బాల్లో వారి పాదయాత్రకో పేరు పెట్టుకుని.. తమ గురించి ప్రజలకు వివరించుకున్నారు.
90ల చివర్లో, 21 వ దశకం ఆరంభంలో చంద్రబాబు అనుసరించిన పాలనా విధానాలు వల్ల ఏపీలో రైతాంగం, సామాన్య, కర్షక లోకం తీవ్ర ఇబ్బందులు పడింది. తనను తాను ఏపీకి సీఈవోగా చెప్పుకోవడానికి ఉబలాటపడుతూ తను సీఎంను అనే విషయమే మరిచిపోయారు అప్పట్లో చంద్రబాబు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థాన యాత్ర సునామీని సృష్టించింది. ఆ యాత్ర ద్వారా వైఎస్ తన గురించి ప్రజలకు కొత్తగా పరిచయం చేసుకోగలిగారు! ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర!
వైఎస్ తర్వాత ఆయన కూతురు వైఎస్ షర్మిల మరో ప్రజాప్రస్థాన యాత్ర అంటూ సుదీర్ఘ యాత్రను చేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడింది.
ఇక చంద్రబాబు నాయుడూ ఒక పాదయాత్ర చేశారనే విషయం తక్కువ మందికే గుర్తు ఉండవచ్చు! *వస్తున్నా మీకోసం* అంటూ ఒక యాత్రను చేశారు చంద్రబాబు. వరసగా రెండు సార్లు ప్రజలు ఓడించాకా చంద్రబాబు నాయుడు ఆ యాత్రను చేశారు. అయితే అదే మాత్రం ప్రజలతో కనెక్ట్ కాలేదు! 2014లో చంద్రబాబుకు అధికారం అంది ఉండవచ్చు. కానీ, ఆ అధికారం అందడంలో పవన్ కల్యాణ్ మద్దతు, మోడీ వేవ్ ప్రధానంగా దోహదం చేశాయి కానీ చంద్రబాబు చేపట్టిన యాత్ర ను గుర్తు పెట్టుకుని 2014లో ఆ పార్టీకి ఓటేసిన వారు ఉండరు! ప్రజలతో ఏ మాత్రం కనెక్ట్ కాలేదు చంద్రబాబు చేసిన యాత్ర. అంతేకాదు. చంద్రబాబు కూడా ఎప్పుడూ తన పాదయాత్ర అనుభవాలను చెప్పుకోరంటే ఆయనకైనా ఆ యాత్ర గుర్తుందా అనే సందేహం వస్తుంది! తను చేపట్టిన యాత్రలో ప్రజల గురించి తనేం తెలుసుకున్నట్టో,లేదా తన గురించి వారికి ఏం తెలియజేసినట్టో చంద్రబాబు ఎప్పుడూ చెప్పరు!
కట్ చేస్తే ఇప్పుడు ఆయన తనయుడు పాదయాత్రను చేస్తున్నారు. 400 రోజులు, 4000 కిలోమీటర్లు అంటూ రోజుకో పది కిలోమీటర్ల దూరం నడకను టార్గెట్ గా పెట్టుకున్నారు లోకేష్. మరి రోజుకో పది కిలోమీటర్ల నడక అంటే ఈ వయసులో నారా లోకేష్ ఆరోగ్యానికి చాలా మంచిది అది! ఆయన ఆరోగ్యానికి మేలు చేసే ఈ యాత్ర తెలుగుదేశం పార్టీకి ఏ మేలు చేస్తుందనేదే ప్రశ్నగా మారుతోంది!
ఈ యాత్రలో లోకేష్ ప్రవర్తన ఒక్కోసారి మరీ లేకిగా ఉండటం గమనార్హం! లోకేష్ మాటలు, హావభావాలు, సైగలు.. ఇవన్నీ సగటు కృష్ణా జిల్లా పోకిరీ కమ్మ కుర్రవాడిని గుర్తు చేస్తాయి. అది కూడా ఇంగితం లేని, అహంభావం అంకితమైన 40 యేళ్ల వయస్కుడు లోకేష్ అని అర్థం అవుతుంది.
జగన్ ను విమర్శించడం లోకేష్ తన యాత్రలో పెట్టుకున్న లక్ష్యం. మరి ఆ విమర్శిచేదైనా ఏమైనా పద్ధతిగా ఉంటోందా? వాడూ, వీడు, ఒరేయ్.. అంటూ మాట్లాడుతున్నారు! మరి ఇలా మాట్లాడితే తనలోని ఫ్రస్ట్రేషన్ ను, పరాకాష్టకు చేరిన తన అహంకారాన్ని చాటుకోవడం అవుతుంది కానీ, అది తన నాయకత్వ పటిమ అవుతుందని లోకేష్ ఎందుకు అనుకుంటున్నారో! పాదయాత్రకు ముందు లోకేష్ కు చాలా లౌక్యాలు, మెలకువలు నేర్పే పంపి ఉంటారని అంతా అనుకున్నారు. అయితే లోకేష్ రోడ్డు మీద పడ్డాకా వ్యవహరిస్తున్న తీరు చూసినా, ఆయన మాటలు విన్నా.. అబ్బే, అలాంటిదేమీ లేదని కొందరు, ఒకవేళ లోకేష్ కు ఎంత నేర్పి ఉన్నా ఆయన అంతేనేమో అని మరికొందరు అనుకునే పరిస్థితి దాపురించింది.
తనలోని అకతాయి తనాన్ని, అవగాహన లేమిని, అర్ధ జ్ఞానాన్ని, అహంకారాన్ని, ఇంగితం లేని నేచర్ ను లోకేష్ ఈ పాదయాత్రలో ప్రదర్శిస్తున్నాడు. యువగళం అంటూ దీనికి పెట్టిన పేరుకూ, లోకేష్ వ్యవహార శైలికి అణుమాత్రం సంబంధం లేదు! తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టుగా లోకేష్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. బహుశా ఇలాంటి ఆకతాయి తనాన్ని ప్రదర్శించడం గొప్ప అని, ఇదే నాయకత్వం అనుకుని లోకేష్ భ్రమపడుతూ ఉంటే, ఇది కాదని నిరూపించడం ప్రజలకు 2024 ఎన్నికలు తగిన అవకాశం! లోకేష్ కు కూడా ఇది అప్పుడే అర్థం అవుతుంది!