భోళా శంకర్..చిరు వాయించేస్తున్నారు

వాల్తేర్ వీరయ్య హిట్ వరకు భోళాశంకర్ మీద ఎవ్వరి దృష్టి పెద్దగా లేదు. చాలా కాలం గ్యాప్ తరువాత మెహర్ రమేష్ డైరక్షన్ చేయడం ఓ రీజన్ కావచ్చు. ఈ రీమేక్ సినిమా మీద…

వాల్తేర్ వీరయ్య హిట్ వరకు భోళాశంకర్ మీద ఎవ్వరి దృష్టి పెద్దగా లేదు. చాలా కాలం గ్యాప్ తరువాత మెహర్ రమేష్ డైరక్షన్ చేయడం ఓ రీజన్ కావచ్చు. ఈ రీమేక్ సినిమా మీద ఇప్పుడు కాస్త దృష్టి పడింది. ఎందుకంటే వాల్తేర్ వీరయ్య హిట్ తో మెగాస్టార్ జోష్ మళ్లీ మొదలైంది అని అనుకోవచ్చు కనుక. 

మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్టిల్ ను వదిలారు. మెగాస్టార్ అల్ట్రా మోడరన్ స్టయిలిష్ లుక్ లో ఢమరుకం పట్టుకుని, నృత్య భంగిమలో నిల్చున్న స్టిల్ అది.

కేవలం శివరాత్రి కోసం డిజైన్ చేసారో లేక సినిమాలో వుంటుందో తెలియాల్సి వుంటుంది. ఈ స్టిల్ ను పట్టుకుని సినిమా గురించి ఊహించుకునేంత, సినిమా బజ్ అమాంతం పెరిగిపోయేంత ఏమీ లేదు. జస్ట్ ఓ శుభాకాంక్షల స్టిల్ మాత్రమే.

వాల్తేర్ వీరయ్య సినిమా తరువాత మెగాస్టార్ ఈ భోళాశంకర్ మీద గట్టి దృష్టి పెట్టారని, అన్నీ తానై చేసుకుంటున్నారని, చూసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. పూర్తి యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ గా భోళాశంకర్ ను మార్చారని టాక్ కూడా వుంది. ఈ ఏడాది దసరా కు అటు ఇటుగా ఈ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు ఎకె ఎంటర్ టైన్ మెంట్స్.