దేశ రాజధాని ఢిల్లీలో తన ప్రియుడే 23 ఏళ్ల నిక్కీ యాదవ్ అనే యువతిని చంపి మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచిపెట్టిన కేసులో మరో కీలక విషయం బయటపడింది. ఇన్ని రోజులు వారిద్దరూ సహజీవనంలో ఉన్నారంటూ వార్తలు రాగా.. వాటిలో నిజం లేదని తెలుస్తోంది. సాహిల్, నిక్కీలు 2020 అక్టోబర్‌లో నోయిడాలోని ఆర్యసమాజ్ ఆలయంలో వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వారి వివాహ ధృవపత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందటే.. కోచింగ్ సెంటర్‌కు ఇద్దరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణించే సమయంలో సాహిల్, నిక్కీ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ సాహిల్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో నిక్కీకి తెలియకుండానే మరోకరితో నిశ్చితార్థం చేసుకున్నాడు ఆ విషయం తెలిసిన నిక్కీ.. సాహిల్ ను ప్రశ్నించగా మొబైల్ చార్జింగ్ కేబుల్‌ను నిక్కీ మెడకు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి తన దాబాలోని ఫ్రీజర్‌లో పడేశాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి.. ఆ తర్వాతి రోజున నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
ఒకవైపు తమ కుమారై ఫోన్‌కు స్పందించకపోవడంతో అనుమానించిన నిక్కీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ మాట్లాడుతూ… అతను చాలా కఠినమైన వాడని, తనతో సహజీవనం చేస్తున్నా భాగస్వామిని హత్య చేయడమే గాక, అదే రోజున మరో మహిళను వివాహం చేసుకున్నాడు' అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.