మళ్లీ సినిమాల్లో నటించేది లేదని పలుమార్లు నొక్కి వక్కాణించిన పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో తనకి పెద్దగా పని లేక పోవడంతో తిరిగి నటించాలని డిసైడ్ అయ్యాడు. అందులో తప్పేమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకో సిగ్గు పడుతున్నాడు.
పింక్ రీమేక్‌లో నటించడానికి అంగీకరించి దిల్ రాజు దగ్గర్నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నా కానీ తాను ఈ చిత్రం చేస్తోన్న సంగతిని గుట్టుగా వుంచాలని పవన్ కోరాడు.
ఇవాళ కాకపోతే రేపయినా పవన్‌కళ్యాణ్ ఈ సెట్స్‌కి వెళ్లిన సంగతి తెలిసిపోతుంది. అలా తెలిసే కంటే తానే స్వయంగా ఈ చిత్రంలో నటిస్తోన్న సంగతిని ప్రకటిస్తే గౌరవప్రదంగా వుంటుంది.
రాజకీయాల్లో బిజీ అవుతా అనుకోవడం వల్ల నటించనని అన్నాడని, ఇప్పుడు ఖాళీ వుండడం వల్ల నటిస్తున్నాడని అభిమానులు కూడా సర్ది చెప్పుకుంటారు.
తానేదో తప్పు చేస్తున్నట్టుగా పవన్ గుట్టు పాటించడం రాంగ్ సిగ్నల్స్ పంపిస్తోంది. అలాగే తనకి అడ్వాన్స్‌లు ఇచ్చి ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న మైత్రి మూవీస్ వారికి, ఏ.ఎం. రత్నంకి ముందుగా డేట్స్ ఇవ్వకుండా దిల్ రాజుకి సినిమా చేయడం కూడా పవన్ నైతికతపై ప్రశ్నలు రేకెత్తుతోంది.