ఎట్టకేలకు సమంత ఖుషి

అనారోగ్యం కారణంగా ఖుషి సినిమాకు దూరమైంది సమంత. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. అయితే కాస్త కోలుకున్న వెంటనే విజయ్ దేవరకొండ సినిమాకు కాకుండా, ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కు ఆమె…

అనారోగ్యం కారణంగా ఖుషి సినిమాకు దూరమైంది సమంత. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. అయితే కాస్త కోలుకున్న వెంటనే విజయ్ దేవరకొండ సినిమాకు కాకుండా, ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కు ఆమె హాజరవ్వడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. 

ఆ వెంటనే సమంత కూడా రియాక్ట్ అయింది. త్వరలోనే ఖుషి సినిమా సెట్స్ పైకి వస్తుందని తెలిపిన సమంత, అదే టైమ్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పింది. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది.

ఖుషి సినిమాకు సమంత డేట్స్ కేటాయించింది. మార్చి 1 నుంచి ఈ సినిమా మళ్లీ మొదలుకాబోతోంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. 

సమంత లిస్టులో శాకుంతలం సినిమా కూడా ఉంది. ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఖుషికి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయిన వెంటనే, శాకుంతలం ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తుంది సమంత. 

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఖుషి సినిమా. ఇంతకుముందు శివ నిర్వాణ-సమంత కాంబోలో మజిలీ సినిమా వచ్చింది. విజయ్ దేవరకొండతో శివ నిర్వాణకు ఇదే తొలి సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.