పచ్చబొట్టుగా మారిన పెళ్లి సర్టిఫికేట్

వాలంటైన్స్ డే రోజున ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు, పెళ్లయిన తర్వాత వాలంటైన్స్ డే మొక్కుబడి తంతుగా మారిపోవడం సహజం. కానీ ఇక్కడో భర్త మాత్రం భార్యకి వాలంటైన్స్ డే రోజున ఓ…

వాలంటైన్స్ డే రోజున ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు, పెళ్లయిన తర్వాత వాలంటైన్స్ డే మొక్కుబడి తంతుగా మారిపోవడం సహజం. కానీ ఇక్కడో భర్త మాత్రం భార్యకి వాలంటైన్స్ డే రోజున ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. చేతిపై టాటూ వేసుకుని ఇంటికెళ్లాడు. ఆ టాటూ చూసి ఆవిడ అవాక్కయింది. ఇంతకీ ఆ టాటూ ఏంటనేగా మీ సందేహం.

అమ్మ, నాన్న, అమ్మే నా ప్రాణం, నాన్నకు ప్రేమతో.. ఇలా రకరకాలుగా పచ్చబొట్లు పొడిపించుకునేవారు ఉంటారు. భార్యపై ఇష్టం ఉంటే ఆమె పేరు రాయించుకుంటారు, ఇంకా ప్రేమ ఎక్కువైతే ఆమె ఫొటో వేయించుకుంటారు, కానీ మనోడు మాత్రం మ్యారేజ్ సర్టిఫికెట్ ని చేతిపై టాటూగా వేయించుకున్నాడు.

అతడి పేరు వాల్, థాయిల్యాండ్ లోని కెంగ్ కొయ్ లో నివశిస్తుంటాడు. వాలంటైన్స్ డే రోజున ఉదయాన్నే భార్యకు చెప్పకుండా బయటకు వెళ్లాడు వాల్. ముందుగానే ప్లాన్ చేసుకున్న టాటూ పార్లర్ కి వెళ్లాడు. ఏకబిగిన 8 గంటలసేపు నొప్పిని భరిస్తూ మ్యారేజ్ సర్టిఫికెట్ ని చేతిపై టాటూ వేయించుకున్నాడు.

ఇంటికెళ్లి భార్యకు చూపించగానే ఆమె షాకైంది. ఆ తర్వాత అతడిని హత్తుకుని ముద్దు పెట్టుకుందట. ఈ విషయాన్ని సదరు టాటూ స్టూడియో ఓనర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.