గవర్నర్ తో వైసీపీకి కయ్యం…ఏమి కోరికండీ బాబూ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ కేంద్రాన్ని మిధ్య అన్నారు. గవర్నర్ల వ్యవస్థ మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ వ్యవస్థ దండుగ మారిది అన్నారు. అలాంటి పార్టీకి వారసులుగా ఉన్న తెలుగుదేశం నేతలకు తమ…

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ కేంద్రాన్ని మిధ్య అన్నారు. గవర్నర్ల వ్యవస్థ మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ వ్యవస్థ దండుగ మారిది అన్నారు. అలాంటి పార్టీకి వారసులుగా ఉన్న తెలుగుదేశం నేతలకు తమ స్టాండ్ ఏంటి అన్నది అర్ధం కాదేమో

గవర్నర్ పదవి రాజ్యాంగపరమైనది. రాజకీయాలతో సంబంధం లేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏ విధంగానూ గవర్నర్లు ఇబ్బంది పెట్టినా అది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఇది ఎవరైనా అనే మాట. కానీ తెలుగుదేశం నేతలు తీరు ఎలా ఉంది అంటే గవర్నర్ తో వైసీపీ ప్రభుత్వానికి లడాయి రావాలి. ఏపీ లో రాజ్ భవన్ తో ఢీ కొట్టాలి. కలహాల కాపురం అయితే ఆ చలి మంటలో తాము కాచుకోవచ్చు అన్నట్లుగా తీరు ఉంది.

కొత్త గవర్నర్ ఏపీకి వచ్చారు ఇక వైసీపీకి జింతాక్ జింతాక్ అని సీనియర్ తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంబరపడుతున్నారు. ఆయన ఉద్దేశ్యంలో గవర్నర్ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అలా ఏపీ ప్రభుత్వం తో గొడవలు వస్తే చూడాలని ఉన్నట్లుగా ఉంది అంటున్నారు.

నిజానికి గవర్నర్ల పాత్ర మీద ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. తమిళనాడులోని స్టాలిన్ అయినా కేరళలో పినరయ్ విజయన్ అయినా తెలంగాణా సీఎం కేసీయార్ అయినా మమతా బెనర్జీ అయినా రాజ్ భవన్ అనవసర జోక్యం అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.

దేశానికి దశ దిశ తామే చూపించామని తమది జాతీయ పార్టీ అని గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం గవర్నర్ వ్యవస్థ వారి అనవసర జోక్యాల మీద తన విధానం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి తరుణంలో కొత్త గవర్నర్ వస్తున్నారు. వైసీపీకి ఆటలు సాగవు అంటూ తమ్ముళ్ళు చంకలు గుద్దుకోవడం అంటే తన కుటిల రాజకీయమే తప్ప విధానపరమైన స్పష్టత పార్టీకి ఉండదా అని ప్రత్యర్ధులు అంటున్నారు.

తాము అధికారంలో ఉంటే సీబీఐ వద్దు అంటారు, తాము దిగి ప్రత్యర్ధి పార్టీ అధికారంలోకి వస్తే సీబీఐ భేష్ అంటారు. తాము పవర్ లో ఉంటే గవర్నర్ల మీద విమర్శలు చేస్తారు. వేరే వారు అధికారంలో ఉంటే గవర్నర్లు వారిని నిలువరించాలని అంటారు. ఎంతో చరిత్ర ఉందని చెబుతున్న పార్టీకి తాత్కాలిక రాజకీయాలే తప్ప కచ్చితమైన ఆలోచనలు ఉండవా అని ప్రత్యర్ధులు అంటున్నారు, గట్టిగానే విమర్శిస్తున్నారు.

అయినా కొత్త గవర్నర్ వస్తే తమకు ఏమిటి నష్టం. తమ పాలన తాము సజావుగా చేస్తామని వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. తెలుగుదేశం నేతలు నేలబారుడు రాజకీయాలు ఇలాగే ఉంటాయని విమర్శలు చేస్తున్నారు.